AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: తాళికట్టు శుభవేళ..! పెళ్లి దుస్తుల్లో స్పోర్ట్స్ బైక్‌పై దూసుకెళ్తున్న నవ వధువు.. ఏం జరిగిందంటే..

బెంగాల్‌కు చెందిన కాజల్ దత్తా వీడియో వైరల్ అవుతోంది. కాజల్‌ ప్రొఫెషనల్ బైక్ రైడర్ అని తెలుస్తుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో బైక్ రైడింగ్‌కు సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి. వైరల్‌గా మారుతున్న ఈ వీడియోను చూసి జనాలు కూడా రకరకాల కామెంట్స్‌తో ప్రశంసిస్తున్నారు. వీరిలో ఒక వినియోగదారు వ్యాఖ్యనిస్తూ...

Watch Video: తాళికట్టు శుభవేళ..! పెళ్లి దుస్తుల్లో స్పోర్ట్స్ బైక్‌పై దూసుకెళ్తున్న నవ వధువు.. ఏం జరిగిందంటే..
Bride Rides A Sports Bike
Jyothi Gadda
|

Updated on: Feb 05, 2024 | 11:32 AM

Share

సాధారణంగా పెళ్లిళ్లలో వధువు ప్రవేశం ఎలా జరుగుతుంది? కొన్ని సంప్రదాయాల ప్రకారం.. పల్లకీలో మోసుకువస్తారు. కొందరు పూల బుట్టలో ఎత్తుకుని వస్తారు. మరికొందరు పట్టువస్త్రాలు పరిచి దానిపై నడిపిస్తారు.. కొందరు పూల దారి వేస్తారు.. దానిపై ఆమె నడుచుకుంటూ వస్తుంది. వధువు ఎంట్రీ స్టైల్ ఇలా ఉంటుంది. ఒక రాణి రాజభవనానికి వెళుతున్నట్లు అనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధువు ఎంట్రీ చూసిన తర్వాత మీ ఆలోచనలు మారిపోతాయి. ఇది చూసి మీరు షాక్ అవుతారు. ఈ ఆధునిక వధువును చూసిన అభినందిస్తారు. వధువు ఈ అపూర్వ ఎంట్రీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పెళ్లికూతురు స్పోర్ట్స్ బైక్ నడుపుతూ కనిపించింది. వధువు ఎలాంటి సమస్య, టెన్షన్‌ లేకుండా ఎక్స్‌పర్ట్‌ బైక్ రైడర్‌లా రోడ్డుపై వేగంగా స్పోర్ట్స్ బైక్‌ను నడుపుతోంది. వధువు బైక్ రైడింగ్ స్కిల్స్ చూసి జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో వధువు కంప్లీట్‌ వెడ్డింగ్‌ సూట్‌లోనే కనిపిస్తుంది. అయితే పెళ్లికూతురు గెటప్‌లో కూడా యువతి ఎంతో అద్భుతంగా బైక్ నడుపుతూ కనిపించటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. @_rider_girl_kajal_ అనే ఖాతాతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేయబడింది. వీడియోకు ఇప్పటివరకు 3.50 లక్షల మందికి పైగా లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి

బెంగాల్‌కు చెందిన కాజల్ దత్తా వీడియో వైరల్ అవుతోంది. కాజల్‌ ప్రొఫెషనల్ బైక్ రైడర్ అని తెలుస్తుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో బైక్ రైడింగ్‌కు సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి. వైరల్‌గా మారుతున్న ఈ వీడియోను చూసి జనాలు కూడా రకరకాల కామెంట్స్‌తో ప్రశంసిస్తున్నారు. వీరిలో ఒక వినియోగదారు వ్యాఖ్యనిస్తూ… బెంగాలీ అమ్మాయిలు అద్భుతంగా ఉన్నారు.. అని రాశారు. మరో వినియోగదారు స్పందిస్తూ.. ప్రతి వధువు ఇలాంటి స్పూర్తివంతం, మనోధైర్యం, కాన్ఫిడెన్స్‌ కలిగి ఉండాలని అని వ్యాఖ్యానించారు. మరో వినియోగదారు ఫన్నీగా స్పందిస్తూ…ఆమె పెళ్లిని వదిలించుకుని పారిపోతోందంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..