తల్లిని చూసేందుకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన యువతికి ఊహించని గిఫ్ట్‌..! ఆ పాత ఇంట్లో దొరికిన నిధి చూసి కళ్లు బైర్లు..

ఎంతో విలువైన బంగారు, వెండి నగలు దొరికిన తర్వాత తనకు చాలా సంతోషంగా ఉందని ఆ అమ్మాయి చెబుతోంది. ఇవి కేవలం విలువైన ఆభరణాలు మాత్రమే కాదు, పాత జ్ఞాపకాలు, వాటి వెనుక ఎన్నో అమూల్యమైన కథలు ఉన్నాయని చెప్పింది. ఈ వీడియోను లక్షలాది మంది చూశారు. అందులో తాను ధరించగలిగేవి చాలా ఉన్నాయని, అయితే అవి పాతవి, స్వచ్ఛమైనవి కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉంచుకుంటానని సదరు యువతి స్వయంగా చెప్పింది.

తల్లిని చూసేందుకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన యువతికి ఊహించని గిఫ్ట్‌..! ఆ పాత ఇంట్లో దొరికిన నిధి చూసి కళ్లు బైర్లు..
Trove Of Gold Jewelry
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 05, 2024 | 11:11 AM

భూమిలో పాతిపెట్టిన నిధి, గోడలో దాచిన బంగారం, వెండి పెట్టె దొరికిందనే వార్తలు మనం వింటుంటాం. మనకూ అలాంటిది దొరికతే బాగుండునూ..అని చాలా సార్లు అనుకుంటాం. అయితే, ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరగవు. ముఖ్యంగా ఈ యుగంలో ఎవరికైనా అలాంటి నిధి దొరికితే ఆనందంతో పిచ్చెక్కిపోతారు. కానీ, అమెరికాలో ఉంటున్న ఓ అమ్మాయి విషయంలో అలాంటిదే జరిగింది. ఆమె తన తల్లిని కలవడానికి తన పాత ఇంటికి వెళ్ళింది. కానీ, అక్కడ ఆమె ఊహించని అద్భుతం జరిగింది. ఈరోజుల్లో బంగారం ధర ఎంతగా పెరిగిపోయిందంటే, చెవిపోగులు, ఉంగరం తయారుచేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేంతగా అలాంటిది.. ఈ అమ్మాయి కూర్చున చోటనే ఓ డబ్బా నిండా బంగారు ఆభరణాలు దొరికాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాకు చెందిన కంటెంట్ సృష్టికర్త యోలాండా డియాజ్ టిక్‌టాక్‌లో తనకు జరిగిన ఈ సంఘటనను వివరించింది. తన పాత ఇంటికి తన తల్లిని కలవడానికి వెళ్లానని చెప్పింది. ఈ సందర్భంలోనే మెక్సికోలోని తన ఇంట్లో ఎన్నో బంగారు, వెండి ఆభరణాలు దొరికాయి. ఈ ఆభరణాలలో కంకణాలు, చెవిపోగులు, ఉంగరాలు, నెక్లెస్ ఉన్నాయని చెప్పింది. యోలాండా ఈ బంగారు ఆభరణాలను తన అనుచరులకు చూపించి, ఇది తన ఇంట్లో భద్రపరిచిన ఒకప్పటి తన అమ్మమ్మ పాత నగలు అని చెప్పింది. కానీ, దాని గురించి వారికి తెలియదు. ఇప్పుడు యోలాండా తల్లి వాటిని తనకు ఇచ్చిందని చెప్పింది.

ఎంతో విలువైన బంగారు, వెండి నగలు దొరికిన తర్వాత తనకు చాలా సంతోషంగా ఉందని ఆ అమ్మాయి చెప్పింది. ఇవి కేవలం విలువైన ఆభరణాలు మాత్రమే కాదు, పాత జ్ఞాపకాలు, వాటి వెనుక ఎన్నో అమూల్యమైన కథలు ఉన్నాయని చెప్పింది.  అందులో తాను ధరించగలిగేవి చాలా ఉన్నాయని, అయితే అవి పాతవి, స్వచ్ఛమైనవి కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉంచుకుంటానని యోలాండా స్వయంగా చెప్పింది.  యువతి చేసిన సోషల్ మీడియా పోస్టోను చాలా మంది  చూశారు. అది చూసిన వారంతా తమ అభిప్రాయాలను తెలియజేశారు.. తాము కూడా మెక్సికోలో పుట్టాలని కోరుకుంటున్నామని సరదాగా అన్నారు. కొంతమంది వినియోగదారులు స్పందిస్తూ.. ఆ సంపదంతా చాలా అందంగా ఉందని ఎంతో విలువైనదని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..