Banana Ghee benefits: ప‌ర‌గ‌డుపునే అరటిపండు, నెయ్యిని క‌లిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..!? ముఖ్యంగా పురుషుల‌కు..

అరటిపండులో విటమిన్ సి, బి-6, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని ఉపయోగించడం వల్ల వైరస్, ఫ్లూ, దగ్గు, జలుబు వంటి వాటి నుంచి రక్షణ లభిస్తుంది. ఈ రెండింటినీ కలిపి తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

Banana Ghee benefits: ప‌ర‌గ‌డుపునే అరటిపండు, నెయ్యిని క‌లిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..!? ముఖ్యంగా పురుషుల‌కు..
Banana Ghee Benefits
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 05, 2024 | 8:33 AM

Banana Ghee health benefits : అరటిపండు, నెయ్యి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన పదార్థాలు. రెండూ శరీరానికి కావలసిన అన్ని పోషకాలను అందిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అరటిపండులో విటమిన్ సి, బి-6, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని ఉపయోగించడం వల్ల వైరస్, ఫ్లూ, దగ్గు, జలుబు వంటి వాటి నుంచి రక్షణ లభిస్తుంది. ఈ రెండింటినీ కలిపి తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

1. అరటి పండులో పీచు, ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. దీన్ని నెయ్యితో కలిపి సేవించడం వల్ల శరీరంలోని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

2. అరటిపండు, నెయ్యి కలిపి తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, మలబద్ధకం, అసిడిటీని కూడా తగ్గిస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇవి కూడా చదవండి

3. అరటిపండు, నెయ్యి కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

4. త్వరగా బరువు పెరగాలంటే అరటిపండు, నెయ్యి కలిపి తీసుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన రీతిలో బరువును పెంచుతుంది.

5. నెయ్యి, అరటిపండు కలిపి తింటే కండరాలు బలపడతాయి.

6. అరటి పండు, నెయ్యి పురుషులకు చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుంది.

7. నెయ్యి, అరటిపండు తినడం వల్ల సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇలా తినండి: ముందుగా అరటిపండు, నెయ్యి తీసుకోండి. ఒక పాత్రలో రెండు చెంచాల నెయ్యి వేయాలి. తర్వాత రెండు అరటిపండ్లను తీసుకుని వాటిని మెత్తగా చేసి బాగా కలపాలి. ఇందులో నెయ్యి కలుపుకుని రోజూ తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..