Nail Care Tips: వామ్మో..! మీరు స్టైల్ కోసం పెంచుకునే గోళ్లలో ఎన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగస్‌లు ఉంటాయో తెలుసా..?

గోళ్లు మనిషి చేతిని అందంగా కనిపించేలా చేస్తాయి. అందుకే అమ్మాయిలు తమ గోళ్లను పొడవుగా పెంచి ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. అయితే మీ అందమైన గోళ్లే మీ అనారోగ్యానికి సగం కారణమని మీకు తెలుసా..? ఒక అధ్యయనం ప్రకారం, మానవులలో వచ్చే అన్ని వ్యాధులలో సగం గోర్లు కారణమని తేలింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Nail Care Tips: వామ్మో..! మీరు స్టైల్ కోసం పెంచుకునే గోళ్లలో ఎన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగస్‌లు ఉంటాయో తెలుసా..?
Nail Care Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 05, 2024 | 8:12 AM

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత చాలా ముఖ్యం. దీనికి రోజూ స్నానం చేస్తే సరిపోదు. మనిషికి వచ్చే వ్యాధుల్లో సగం గోళ్ల ద్వారానే వ్యాపిస్తుందని తెలుసుకోవాలి. అవును ఇది నిజం.. మనకు తెలిసి తెలియకుండా రోజంతా మన చేతులతో శరీరంలోని అన్ని భాగాలను తాకుతాము. అయితే మీ అందమైన గోళ్లే మీ అనారోగ్యానికి సగం కారణమని మీకు తెలుసా..? గోళ్లలో కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పూర్తి వివరాలు తెలిస్తే షాక్ అవుతారు. గోళ్లు మనిషి చేతిని అందంగా కనిపించేలా చేస్తాయి. అందుకే అమ్మాయిలు తమ గోళ్లను పొడవుగా పెంచి ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. కానీ, ఒక అధ్యయనం ప్రకారం, మానవులలో వచ్చే అన్ని వ్యాధులలో సగం గోర్లు కారణమని తేలింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.

అవును.. గోళ్లలో కోట్లాది సూక్ష్మజీవులు ఉన్నట్లు గుర్తించారు. గోళ్ల కింద 32 రకాల బ్యాక్టీరియా, 28 రకాల శిలీంధ్రాలు ఉంటాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం అమెరికన్ పీడియాట్రిక్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించబడింది. గోళ్ల కింద సేకరించిన నమూనాలో 32 రకాల బ్యాక్టీరియా, 28 రకాల శిలీంధ్రాలు ఉన్నట్లు గుర్తించారు. 50శాతం నమూనాలలో బ్యాక్టీరియా మాత్రమే ఉండగా, 6.3శాతం శిలీంధ్రాలను కలిగి ఉంది. 43.7 శాతం బ్యాక్టీరియా, శిలీంధ్రాలు రెండింటినీ కలిగి ఉంటుంది.

ప్రతిరోజూ మనం మన శరీర భాగాలైన ముఖం, కళ్ళు, చెవులు, ముక్కు వంటి భాగాలను మన చేతులతో తాకుతాము. అందుకే గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. గోళ్ల కింద ఉండే బాక్టీరియా, శిలీంధ్రాలు సాధారణంగా ప్రమాదకరం కాని కొన్ని సందర్భాల్లో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు, గోర్లు గాయపడినప్పుడు లేదా ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడు, ఈ సూక్ష్మజీవులు సంక్రమణను తీవ్రతరం చేస్తాయి. లక్షణాలు గోరు రంగు మారడం, వాపు, నొప్పికి కారణం అవుతుంది.

ఇవి కూడా చదవండి

అందుకే చేతులు, గోళ్లను రోజుకు కనీసం రెండుసార్లైనా సబ్బుతో కడుక్కోవాలి. గోళ్ల కింద పేరుకుపోయిన మురికిని తొలగించేందుకు మృదువైన బ్రష్‌ని ఉపయోగించాలి. అలాగే గోళ్లు పెరగకుండా చూసుకోవాలి. గోళ్లు పొడవుగా ఉండడం వల్ల వాటిలో వ్యర్థాలు, మలినాలు పేరుకుపోతాయి. క్రమం తప్పకుండా గోళ్లను కత్తిరించడం మంచిది. మీకు గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకునే అలవాటు ఉంటే ముందుగా గోళ్లను శుభ్రం చేసి తర్వాత అప్లై చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..