AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Updates: తిరుమల వెంకన్న భక్తులకు తీపి కబురు…ఇకపై వారు క్యూ లైన్‌లో నిలబడాల్సిన పనిలేదు..మీ మొబైల్‌కే దర్శన టికెట్!

అంటే రథ సప్తమి పర్వదినాన తిరుమలలో మూడు రోజుల పాటు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.. రథ సప్తమి నాడు వీఐపీ బ్రేక్ దర్శనం ఉండదు. వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం ఉండదు. ఆ రోజు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు చెప్పారు.

TTD Updates: తిరుమల వెంకన్న భక్తులకు తీపి కబురు...ఇకపై వారు క్యూ లైన్‌లో నిలబడాల్సిన పనిలేదు..మీ మొబైల్‌కే దర్శన టికెట్!
Vip Break Darshan
Jyothi Gadda
|

Updated on: Feb 06, 2024 | 8:55 AM

Share

శ్రీవారి భక్తులకు ఇది తీపి కబురు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో వెలసిన శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. వెంకన్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని భావిస్తున్నారు. తిరుమల శ్రీవారి భక్తులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యోచిస్తున్నట్టుగా సమాచారం.. తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం కోసం భక్తులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేసేలా టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమలలో క్యూ లైన్‌లో భక్తులు నిలబడకుండా ఈ చర్యలు తీసుకుంటోంది. ఈ పద్ధతి ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆచరణలో అమలు చేస్తున్నప్పటికీ… త్వరలోనే పూర్తిస్థాయిలో అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇప్పటి వరకు ఎంబీసీ 34 కౌంటర్‌ వద్ద టికెట్ల కోసం భక్తులు భారీ క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి టీటీడీ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. సిఫార్సు లేఖను సమర్పించిన భక్తుని మొబైల్‌కు లింక్‌తో కూడిన మెసేజ్‌ పంపబడుతుంది. ఆ లింక్ పై భక్తులు క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ తర్వాత డబ్బులు చెల్లించాలి. ఆన్‌లైన్‌లో నగదు చెల్లించిన తర్వాత టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. రెండు రోజులుగా టీటీడీ ఈ కొత్త విధానాన్ని ఆచరణాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కొత్త విధానంపై భక్తుల నుంచి అభిప్రాయాలు కోరుతున్నారు. ఈ కొత్త విధానంపై టీటీడీ త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది.

మరోవైపు, ఫిబ్రవరి నెలలో తిరుమలను సందర్శించాలనుకునే వారు ఖచ్చితంగా దీన్ని తనిఖీ చేయాలి. లేదంటే అక్కడికి వెళ్లిన తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అంటే రథ సప్తమి పర్వదినాన తిరుమలలో మూడు రోజుల పాటు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.. రథ సప్తమి నాడు వీఐపీ బ్రేక్ దర్శనం ఉండదు. వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం ఉండదు. ఆ రోజు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..