AP Crime: ప్రాణం తీసిన కేటుగాళ్ళు.. టాస్క్ ఫోర్స్ పోలీసును పొట్టన పెట్టుకున్న రెడ్ శాండిల్ స్మగ్లర్స్..

అన్నమయ్య జిల్లాలో రెడ్ శాండిల్ స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఎర్రచందనం స్మగ్లర్ల అరాచకం టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ప్రాణాలను బలి తీసుకుంది. కూంబింగ్ నిర్వహిస్తున్న రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై దూసుకెళ్లిన స్మగ్లర్ల కారు, కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందేందుకు కారణం అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

AP Crime: ప్రాణం తీసిన కేటుగాళ్ళు.. టాస్క్ ఫోర్స్ పోలీసును పొట్టన పెట్టుకున్న రెడ్ శాండిల్ స్మగ్లర్స్..
Red Sandal Smugglers
Follow us
Raju M P R

| Edited By: Balaraju Goud

Updated on: Feb 06, 2024 | 7:56 AM

అన్నమయ్య జిల్లాలో రెడ్ శాండిల్ స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఎర్రచందనం స్మగ్లర్ల అరాచకం టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ప్రాణాలను బలి తీసుకుంది. కూంబింగ్ నిర్వహిస్తున్న రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై దూసుకెళ్లిన స్మగ్లర్ల కారు, కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందేందుకు కారణం అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కేవీ పల్లి మండలం గుండ్రేవారిపల్లి క్రాస్ వద్ద రోడ్డుపై కాపు కాచిన టాస్క్ ఫోర్స్ పోలీసులను స్మగ్లర్ల కారు వేగంగా ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. సానిపాయి అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నట్లు పక్కా సమాచారం తోనే తిరుపతి నుంచి వెళ్లిన ట్రాన్స్ ఫోర్స్ టీమ్ ఎర్రచందనం దొంగలు పట్టుకునే ప్రయత్నం చేసింది. కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులను గుర్తించి తప్పించుకునే ప్రయత్నం చేసిన స్మగ్లర్లు పోలీసులపైకి కారుతో వేగంగా దూసుకెళ్ళారు.

స్మగ్లర్ల కారు కానిస్టేబుల్ గణేష్‌ను వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే కాపు కాచిన పోలీసులు స్మగ్లర్ల కారును చేజ్ చేసి పట్టుకోగా కారు దిగి ముగ్గురు స్మగ్లర్లు పరారీ అయ్యారు. స్మగ్లర్ల కారును సీజ్ చేసిన పోలీసులు కారులోని 7 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న మరో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

ఘటనా స్థలంలోనే 30 ఏళ్ల గణేష్ అనే కానిస్టేబుల్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన కానిస్టేబుల్ గణేష్ డెడ్ బాడీని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం కు చెందిన గణేష్ తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరారైన స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…