AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thammineni Seetharam: తెలంగాణ సమాజం ప్రశ్నించింది అందుకే.. మరో వేర్పాటువాద ఉద్యమం రానివ్వొద్దు..

విశాఖ రాజధాని సాధన ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసలో మంగళవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ మీటింగ్‌లో స్పీకర్‌ తమ్మినేని పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం కావడం వల్ల..

Thammineni Seetharam: తెలంగాణ సమాజం ప్రశ్నించింది అందుకే.. మరో వేర్పాటువాద ఉద్యమం రానివ్వొద్దు..
Thammineni Seetharam
Shaik Madar Saheb
|

Updated on: Nov 02, 2022 | 3:54 PM

Share

ఓ వైపు అమరావతి ఉద్యమం.. మరో వైపు మూడు రాజధానుల ఉద్యమంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈ తరుణంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వేర్పాటువాద ఉద్యమం రావొద్దంటే.. ప్రతిఒక్కరూ రాజధానిగా విశాఖకు మద్దతునివ్వాలని ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం. ఆనాటి పాలకులు హైదరాబాద్‌ వైపే చూస్తూ మిగితా ప్రాంతాల్ని నిర్లక్ష్యం చేయడం వల్లే.. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ సమాజం ప్రశ్నించిందన్నారు. విశాఖ రాజధాని సాధన ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసలో మంగళవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ మీటింగ్‌లో స్పీకర్‌ తమ్మినేని పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం కావడం వల్ల.. సీమాంధ్ర ప్రజలకు ఇష్టం లేకపోయినా అప్పుడు రాష్ట్రం విడిపోవాల్సి వచ్చిందన్నారు తమ్మినేని. మరోసారి అలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశ్యంతోనే.. సీఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు.

ప్రతిఒక్కరూ రాజధానిగా విశాఖకు మద్దతివ్వాలని.. నాటి పాలకులు హైదరాబాద్‌వైపే చూడటం వల్ల తెలంగాణ ఉద్యమం పుట్టిందని తమ్మినేని వ్యాఖ్యానించారు. బలమైన కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ సమాజం ప్రశ్నించిందని తమ్మినేని వివరించారు. ఉత్తరాంధ్ర విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉంటే.. అలాంటి ఉద్యమమే వస్తుందని తమ్మినేని అభిప్రాయపడ్డారు.

ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చరిత్ర ఉందని, గతంలో పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ ఇక్కడి పేదరికాన్ని గుర్తించారని తమ్మినేని పేర్కొన్నారు. విశాఖకు రాజధాని ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవకాశం వచ్చిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అనవసర పట్టింపులకు పోకుండా ఉత్తరాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు.. విశాఖ రాజధాని కోసం, వికేంద్రీకరణ కోసం కలిసి రావాలని తమ్మినేని పిలుపునిచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి ఉద్యమమని తమ్మినేని ఈ సందర్భంగా ఆరోపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..