AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత.. సీఏం సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్‌ శాసపమండలి సభ్యుడు చల్లా భగీరథ రెడ్డి ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ మధ్యాహ్నం..

Andhra Pradesh: ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత.. సీఏం సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి
Challa Bhagiratha Reddy (File Photo)
Amarnadh Daneti
|

Updated on: Nov 02, 2022 | 4:58 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ శాసపమండలి సభ్యుడు చల్లా భగీరథ రెడ్డి ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ మధ్యాహ్నం మృతిచెందారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. భగీరథ రెడ్డి భార్య లక్ష్మి ప్రస్తుతం అవుకు జడ్పిటిసి గా ఉన్నారు. గత ఏడాది జనవరిలోనే ఎమ్మెల్సీగా ఉంటూ భగీరథరెడ్డి తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. తండ్రి మరణం తర్వాత ఎమ్మెల్యే కోటాలో భగీరథ రెడ్డికి సీఏం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తండ్రి చనిపోయి రెండేళ్లు కూడా గడవకముందే ఎమ్మెల్సీగా ఉన్న కొడుకు భగీరథరెడ్డి మృతి పట్ల బనగానపల్లె నియోజకవర్గం లో విషాదం నెలకొంది. రేనాటి గడ్డలో తండ్రి కొడుకుల రాజకీయ నేపథ్యం మరువలేనిది. భగీరథ రెడ్డి స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. భగీరథ రెడ్డి కొద్ది రోజులుగా కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. సమస్య తీవ్రతరం కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనను చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని వైద్యులు చెబుతూ వచ్చారు. అయితే భగీరథరెడ్డికి వెంటిలేటర్‌పై మొదట 100 శాతం ఆక్సిజన్‌ ఇచ్చారని.. ప్రస్తుతం 60 శాతానికి తగ్గించారని, శరీరం చికిత్సకు సహకరిస్తున్నట్లు వైద్యులు తెలిపారని సన్నిహితులు ఈ ఉదయం తెలిపారు. అయితే ఆయన కోలుకుంటారని అంతా భావించారు. కాని శరీరం చికిత్సకు సహకరిస్తుందని చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల జిల్లా అవుకులో ఉన్న ఆయన గత ఆదివారం తీవ్రమైన దగ్గుతో ఇబ్బందిపడగా.. కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.

రాజకీయ నేపథ్యం

చల్లా భగీరథ రెడ్డి తండ్రి చల్లా రామకృష్ణా రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ రాజకీయ నేత. వారి కుటుంబం టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కీలకంగా వ్యవహరించింది. అంతేకాదు రామకృష్ణారెడ్డి 1983లో పాణ్యం, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కోవెలకుంట్ల అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బనగానపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేశారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో రామకృష్ణా రెడ్డి ఏపీ సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఎమ్మెల్సీ పదవి దక్కింది. 2020లో చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో కన్నుమూశారు. ఆ తర్వాత ఆయన వారుసుడిగా కుమారుడు రాజకీయాల్లోకి వచ్చారు. రామకృష్ణా రెడ్డి కన్నుమూయడంతో భగీరథ రెడ్డి కి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి

ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో మంత్రుల, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పాటు పలు పార్టీల నాయకులు భగీరథ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భగీరథ రెడ్డి కుటుంబీకులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుకు రానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..