Andhra Pradesh: రాజోలు ఏటిగట్టుకు గండి పెట్టేందుకు కుట్ర.. సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే..
Andhra Pradesh: రాజోలు ఏటీగట్టు కు గండి పెట్టేందుకు కుట్ర చేశారని ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు.
Andhra Pradesh: రాజోలు ఏటీగట్టు కు గండి పెట్టేందుకు కుట్ర చేశారని ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. స్థానికులే గండి పెట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వర ప్రసాద్.. స్థానికులు, అధికారులు సమన్వయంతో రాత్రి పగలు కష్టపడి ఏటిగట్ల వద్ద ఉండి కాపాడుకుంటున్నామని అన్నారు. ఎక్కడ కూడా ఏటిగట్టు గండిపడలేదని తెలిపారు. కొందరు కావాలనే గండి పడిందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. 15 మంది ఇక్కడి వాళ్లే గండి పెట్టడానికి ప్రయత్నం చేశారని, వాళ్లపై కేసులు పెడతామని ఎమ్మెల్యే అన్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, వారిపై కేసులు పెడతామని చెప్పారు ఎమ్మెల్యే రాపక. గోదావరి వరదలు తగ్గుముఖం పట్టాయని, ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..