Andhra Pradesh: ఏపీలో గుడ్ మార్నింగ్ vs బ్యాడ్ మార్నింగ్.. సోషల్ మీడియా వేదికగా రోడ్లపై రాజకీయ రచ్చ..
అటు వైసీపీ.. ఇటు జనసేన సోషల్ మీడియా టీమ్స్ అటాకింగ్ పొలిటికల్ ఫైట్ చెయ్యడంలో ఎప్పుడూ కూడా స్పీడ్లో ఉంటాయి. ఎప్పుడు ఏ నాయకుడు టంగ్ స్లిప్ అయినా వెంటనే కౌంటర్ అటాకింగ్ చేసుకుంటాయి.
Janasena vs YSRCP: ఏపీలో ప్రస్తుతం యుద్ధం నడుస్తుంది.. యుద్ధం అంటే ఏదో శత్రు దేశాల మధ్య కాదండోయ్.. సోషల్ మీడియా వేదికపై జనసేన వర్సెస్ వైసీపీ సపోర్టర్స్ మధ్య.. ఇరువురు రోడ్ల మీద పెడుతున్న పోస్టులు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. అటు వైసీపీ.. ఇటు జనసేన సోషల్ మీడియా టీమ్స్ అటాకింగ్ పొలిటికల్ ఫైట్ చెయ్యడంలో ఎప్పుడూ కూడా స్పీడ్లో ఉంటాయి. ఎప్పుడు ఏ నాయకుడు టంగ్ స్లిప్ అయినా వెంటనే కౌంటర్ అటాకింగ్ చేసుకుంటాయి. ఇప్పుడు కొత్తగా ట్విట్టర్, ఇన్‌స్టా,ఫేస్బుక్ వేదికగా గుడ్ మార్నింగ్ వెర్సెస్ బ్యాడ్ మార్నింగ్ జోరుగా నడుస్తుంది.
జూలై 15 ఉదయం 7 గంటల 45 నిముషాలకు #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్‌ని పవన్ కళ్యాణ్ లాంఛనంగా మొదలు పెట్టారు. రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే రోడ్డు దుస్థితిని తెలిపే వీడియోను ట్విట్టర్‌లో ఒకటి పోస్టు చేశారు. ఆ వీడియోలో కోనసీమ జిల్లా కొత్తపేట దగ్గర ఉన్న గుంతలు, అక్కడి పరిస్థితిని క్లియర్‌గా చూపిస్తూ ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేశారు.
జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ పోస్ట్ తరువాత జన సైనికులు ఎక్కడికక్కడ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్‌తో సెటైరిక్‌గా పోస్టులు పెట్టడంలో స్పీడ్ పెంచారు. వైసీపీ పార్టీని ఒక్కమాటంటే ఉతికి పడేసే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు.. హ్యాష్ ట్యాగ్‌తో సీఎంను టార్గేట్ చేస్తే ఊరుకుంటారా..? వారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. వైసీపీ సైనికులు సైతం రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు.. సాఫీగా ప్రయాణం చేస్తున్న వీడియోలు తీసి ట్విట్టర్లో కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు.
గతేడాది శ్రమదానం పేరుతో రహదారుల వద్ద నిరసన వ్యక్తం చేసిన జనసెన టీమ్స్.. ఇప్పుడు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో అయితే గుంతలకు వైసీపీ రంగులు వేసిన ఫోటోలు పెట్టారు.
గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటున్న పవన్ కల్యాణ్‌కు.. బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్రుడు అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు పెడుతున్నారు. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కావాలంటే వచ్చి చూసుకో అంటూ ఫోటోలు పోస్టు చేస్తున్నారు. వర్షాలకు రోడ్లు గుంతలు పడటం సాధారమెనని వరద వచ్చిన గోదావరి జిల్లాలో ఫోటోలు తీయడం కాదు.. తమ ప్రాంతానికి వస్తే బాగున్న రోడ్లు చూపిస్తామంటూ వైసీపీ సోషల్ మీడియా సపోర్టర్స్ కామెంట్లు చేస్తున్నారు. బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్రుడు అనే హ్యాట్ ట్యాగ్‌తో పోస్టులు పెడుతూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు.
ఇలా వీడియోలే కాదు రోడ్ల నాడు – నేడు అని ఫోటోలు వైసీపీ పెడుతుంటే.. జనసేనా కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తుండడంతో సోషల్ మీడియా వేదికపై ఏపీ పొలిటికల్ వార్ జరుగుతుంది. ఎదిఏమైనా ఈ గుడ్ మార్నింగ్ వెర్సెస్ బ్యాడ్ మార్నింగ్ రాజకీయాలో ఏపీలో చర్చనీయాంశంగా మారాయి.
– విక్రమ్, టీవీ9 రిపోర్టర్, విజయవాడ
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..