AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏంట్రా మామ ఇలా వచ్చావ్..! పోలీస్ స్టేషన్‌కు అనుకోని అతిథి.. బాబోయ్ అంతా పరుగే పరుగు..

సాధారణంగా పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదులు చేసేందుకు జనాలు వస్తుంటారు. ఇంకా నేరగాళ్ళను పట్టుకొని పోలీసులు స్టేషన్‌కు తీసుకొస్తుంటారు. మరి కొంతమంది ఆకతాయిలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని తీసుకొచ్చి భయపెట్టి బెండు తీస్తుంటారు. కానీ అక్కడ మాత్రం ఆ పోలీసులు అనుకోని అతిథిని చూసి భయపడ్డారు.

Andhra: ఏంట్రా మామ ఇలా వచ్చావ్..! పోలీస్ స్టేషన్‌కు అనుకోని అతిథి.. బాబోయ్ అంతా పరుగే పరుగు..
Snake At Police Station
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jun 14, 2025 | 5:08 PM

Share

సాధారణంగా పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదులు చేసేందుకు జనాలు వస్తుంటారు. ఇంకా నేరగాళ్ళను పట్టుకొని పోలీసులు స్టేషన్‌కు తీసుకొస్తుంటారు. మరి కొంతమంది ఆకతాయిలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని తీసుకొచ్చి భయపెట్టి బెండు తీస్తుంటారు. అందుకే పోలీసులంటే చాలామందికి భయం.. పోలీసులకు భయపెట్టడమే గాని భయపడడం తెలియదు.. కానీ అక్కడ మాత్రం ఆ పోలీసులు ఆ అనుకోని అతిథిని చూసి భయపడ్డారు. పరుగులు తీశారు. చివరకు దాన్ని పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అవును.. పాము అంటే ఎవరికి భయం ఉండదు..? కనిపించగానే హడలెత్తిపోతాం.. కనిపించడం కనీసం దాని పేరు విన్నా సరే కొంతమంది వణికిపోతారు. కానీ పాము మన పక్కనే ఉంటే.. నక్కి ఉన్నట్టు కనిపిస్తే..? వామ్మో.. దాన్ని చూడగానే గుండెలు పట్టుకోక తప్పదు. అటువంటి పరిస్థితి ఎదురైంది విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీసులకు.. ఓ పాము పోలీస్ స్టేషన్లోకి రావడంతో దాన్ని చూసి అందరూ హడలెత్తిపోయారు.

నాలుగు అడుగుల పొడవైన ఆ పామును చూసి.. ఒక్కొక్కరు ఒక్కవైపు పరుగులు తీశారు. చివరకు పాములు పట్టే స్నేక్ కేచర కిరణ్ కు సమాచారం అందించారు పోలీసులు. కిరణ్ తన టీమ్ మేట్ ను పోలీస్ స్టేషన్ కు హుటాహుటిన పంపించారు. అనంతరం ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నాడు స్నేక్ క్యాచర్. దీంతో పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆ పామును పట్టుకున్నంత వరకు పూర్తి టౌన్ లో పనిచేసే పోలీస్ సిబ్బందికి చెమటలు పట్టాయి.. చివరకు ఆ పామును పట్టుకోవడంతో స్నేక్ క్యాచర్ కు అభినందించారు పోలీసులు. అంతేకాదు ప్రశంస పత్రాన్ని కూడా అందించారు.

Snake At Police Station

Snake At Police Station

అది ఆ పామే.. కానీ త్రాచు పాములా.. !

విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లోకి చొరబడిన ఆ పాము జెర్రీ గొడ్డుగా నిర్ధారించాడు స్నేక్ క్యాచర్. ఈ పాము సాధారణంగా ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది విషపూరితం కాదు. పొలాల్లో కాలువల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది. ఎలుకలను వేటాడి తింటుంది. అందుకే దీన్ని ఎలుక పాము (Rat Snake) అని కూడా అంటారు. దీన్ని రైతు మిత్రుడు అని కూడా పిలుస్తారు. అయితే ఆ పాము చూడడానికి త్రాచుపాములా కనిపిస్తుంది. దీంతో అదే విషపూరితమైన త్రాచుపాము అనుకుంటారు జనం. దాదాపుగా పది నుంచి 12 అడుగుల వరకు పెరుగుతుంది. పోలీస్ స్టేషన్ వెనుక వైపు గెడ్డ కాలువ ఉండడంతో అందులో నుంచి పోలీస్ స్టేషన్లోకి ఆ పాము వచ్చి ఉంటుందని పేర్కొంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..