AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు అడ్డుకున్నా ఆగని అమ్మానాన్న ప్రాణాలు.. క్షణికావేశం కొంప ముంచింది..!

అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యనే కడ తీర్చేశాడు ఆ భర్త. తాళికట్టిన చేతులతోనే.. ఆమె తలపై మోది చంపేశాడు. డంబుల్‌తో దాడి చేసి హతమార్చాడు. భార్యను హత్య చేశాక, ఇక జీవితం ఎందుకు అనుకున్నాడో ఏమో గాని, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో జరిగిన ఈ విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది.

పిల్లలు అడ్డుకున్నా ఆగని అమ్మానాన్న ప్రాణాలు.. క్షణికావేశం కొంప ముంచింది..!
Crime News
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jun 14, 2025 | 5:42 PM

Share

అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యనే కడ తీర్చేశాడు ఆ భర్త. తాళికట్టిన చేతులతోనే.. ఆమె తలపై మోది చంపేశాడు. డంబుల్‌తో దాడి చేసి హతమార్చాడు. భార్యను హత్య చేశాక, ఇక జీవితం ఎందుకు అనుకున్నాడో ఏమో గాని, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో జరిగిన ఈ విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. కళ్ళముందే.. తల్లిని హతమరుస్తుంటే పిల్లలు అడ్డుకున్నా ఆ తండ్రి ఆగలేదు.. ఇద్దరు పిల్లలను గదిలో బంధించి.. భార్యను హత్య చేశాక.. తాను ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.

గోపీనాథ్, వెంకటలక్ష్మి భార్య భర్తలు. వారికి 18 ఏళ్ల బాబు మరో 10 ఏళ్ల పాప కూడా ఉన్నారు. గోపీనాథ్ పెయింటర్‌గా పనులు చేసుకుంటూ ఉన్నాడు. విజయవాడలో ఉంటూ తొమ్మిది నెలల క్రితం విశాఖ వచ్చారు. విశాఖ వచ్చిన తర్వాత ఈ భార్యాభర్తల్లో కలహాలు మొదలయ్యాయి. చీటికిమాటికి ఇద్దరు గొడవలు పడేవారు. భార్య వెంకటలక్ష్మి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త గోపీనాథ్ ఆమెన ప్రశ్నిస్తూ ఉండేవాడు. ఈ విషయంలో మరింత వివాదం జరుగుతుండేది. ఆస్తి పత్రాల విషయంలో కూడా వెంకటలక్ష్మి భర్త నిలదీస్తూ వచ్చేవాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

గురువారం(జూన్ 12) రాత్రి.. ఇంట్లో ఇద్దరు మధ్య మళ్లీ వాగ్వివాదం జరిగింది. కొడుకును పిలిచిన గోపీనాథ్.. తల్లిని చంపి తాను కూడా చచ్చిపోతానని చెప్పాడు. అదేంటి నాన్న అలా అంటున్నావ్ అలా చేయొద్దు అని తండ్రిని వారించాడు కొడుకు. సరే పడుకోలే ఉదయం మాట్లాడుకుందాం అని పిల్లలకు సర్ది చెప్పి రూమ్‌లోకి పంపించాడు గోపీనాథ్. వాళ్లు నిద్రలోకి జారుకున్నాక.. భార్య వెంకటలక్ష్మితో మళ్ళీ గోపీనాథ్‌కు మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో గోపీనాథ్, అక్కడే ఉన్న దంబుల్‌తో.. భార్య తలపై మోదాడు. వెంకటలక్ష్మి అరుపులు విన్న పిల్లలు ఇద్దరు వచ్చి చూశారు. అడ్డుకునే ప్రయత్నం చేయబోతే.. కూతురు మెడపై కత్తి పెట్టి కొడుకును బెదిరించాడు తండ్రి. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు పిల్లలు. విచక్షణ రహితంగా భార్య వెంకటలక్ష్మి దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. పిల్లలనున గదిలోకి వెళ్ళమని చెప్పి.. అక్కడే ఉన్న ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు గోపీనాథ్. ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు కంచరపాలెం సిఐ చంద్రశేఖర్.

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పిల్లల స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు పోలీసులు. అయితే వెంకటలక్ష్మిపై భర్త గోపినాథ్‌కు అనుమానం ఉంది. గతంలో ఒకసారి వెంకటలక్ష్మి కూతురిని తీసుకుని అదృశ్యం అవడంతో.. మిస్సింగ్ కేసు కూడా నమోదు అయింది. ఆమెను ట్రేస్ చేసి గోపినాథ్‌కు అప్పగించారు పోలీసులు. ఆ తర్వాత కూడా భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి భర్తపై వెంకటలక్ష్మి. ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి, భార్యను హత్య చేసి తను ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు అంటున్నారు.

ఆత్మహత్య చేసుకునే ముందు గోడపై గోపీనాథ్.. నరేష్ అనే వ్యక్తి పేరు రాసినట్టు.. అతను వల్లే చనిపోయేందుకు సిద్దమైనట్టు అందులో ఉన్న సారాంశం అని స్థానికులు గోపీనాథ్ కొడుకు చెప్పినట్టు స్థానికులు అంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా.. క్షణికావేశంతో ఇద్దరి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అనుమానం పెనుభూతమైంది. భార్య ప్రాణం తీసిన భర్త తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు లేక ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..