AP News: బైక్‌లో వింత శబ్దాలు.. ఏంటని చూడగా దెబ్బకు అక్కడనుంచి పరుగో పరుగు..
మీ బైక్‌లో పాము దూరిందని సుబ్బారావుకు చెప్పాడు... దీంతో కంగారుపడ్డ సుబ్బారావు వెంటనే బైక్ అంతా వెతికాడు... పాము కనిపించలేదు... అయితే పాము సీటు కిందగా లోపలికి వెళ్ళిందని చూసినవాళ్ళు చెప్పడంతో దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు... మిగిలిన వారు కూడా పామును పట్టుకునేందుకు ఓ అరగంటపాటు నానా తంటాలు పడ్డారు...

ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వచ్చిపోయేవారితో రద్దీగా ఉంది… ఒంగోలు గోపాల్ నగరానికి చెందిన సుబ్బారావు ఓ పక్కగా బైక్ పార్క్ చేసుకుని యధాలాపంగా కలెక్టర్ కార్యాలయంలోకి అడుగుపెట్టేందుకు వెళుతున్నాడు… ఇంతలో పెద్దగా ఓ వ్యక్తి కేక వేశాడు… మీ బైక్‌లో పాము దూరిందని సుబ్బారావుకు చెప్పాడు… దీంతో కంగారుపడ్డ సుబ్బారావు వెంటనే బైక్ అంతా వెతికాడు… పాము కనిపించలేదు… అయితే పాము సీటు కిందగా లోపలికి వెళ్ళిందని చూసినవాళ్ళు చెప్పడంతో దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు… మిగిలిన వారు కూడా పామును పట్టుకునేందుకు ఓ అరగంటపాటు నానా తంటాలు పడ్డారు… చివరకు సీటును పైకెత్తి లోపల ఉన్న పసిరిక పామును బయటకు లాగారు… ఓ వ్యక్తి పాము తోకను పట్టుకుని రోడ్డుపై పడేశాడు… అంతే అప్పటి వరకు చోద్యం చూస్తున్న మరో వ్యక్తి వెంటనే కర్రతో పామును కొట్టి చంపేశాడు… ఈ ఘటనతో కొద్దిసేపు ఒంగోలు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కలకలం రేగింది. అయితే ఈ పసిరికపాము వల్ల మనుషులకు పెద్దగా ప్రాణాపాయం ఉండదని చెబుతున్నారు.
పసిరిక పాము విషపూరితమా…
పసిరిక లేదా పచ్చార పాములు విషపూరితమైనవి కావు అని చెబుతారు… ఈ పసిరిక పాములు సాధారణంగా చెట్లపై ఆకుల మధ్యలో ఉంటాయి… ఇవి లేత ఆకుపచ్చ రంగులో ఉండటం వల్ల అవి ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు వీలుగా ఉంటుంది.. పరీక్షగా చూస్తే తప్ప చెట్లపై ఉన్న ఈ పసిరిక పాములను కనిపెట్టలేము.. ఇవి కరిస్తే ఎవరికైనా అలర్జీ ఉంటే కొంచెం ఇబ్బందులు పడతారు. అంతేకాని ప్రాణాలు పోయేంత విషం వీటిలో ఉండదంటారు. ఈ పసిరిక పాములు కప్పలు, చిన్న చిన్న ఎలుకలు, తొండలు, పక్షులు, కీచురాళ్ళు, గొంగళి పురుగులు, మిడతలను పట్టుకుని మింగేస్తాయి. ఆహారాన్ని సేకరించే సమయంలో వాటిని నిదానంగా వెంబడించి, జాగ్రత్తగా వాసన చూసి, ఆ తరువాత తల దగ్గర పట్టుకుని మింగుతాయి… అంటే ఒక విధంగా తన ఆహారం సేకరించే సమయంలో రెక్కీ చేసి అనంతరం దాడి చేస్తాయి… వీటి మెనూలో ఎక్కువగా ఇష్టపడి తినేవాటిలో తొండలు ఉంటాయి.. కాబట్టి ఎక్కడైనా పసిరికపాములు కనిపిస్తే వాటిని చంపేయకండి.. వాటిని అలా వదిలేస్తే వాటి దారిన అవి పోతాయి.