Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో వైసీపీకి వరుస షాక్‌లు.. టీడీపీలో చేరిన వైసీపీ ప్రజాప్రతినిధులు..!

కుప్పంలో టీడీపీ రివర్స్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసింది. టీడీపీని ఖాళీ చేస్తామన్న వైసీపీపై కౌంటర్‌ ఎటాక్‌ మొదలు పెట్టింది. కుప్పంలో వైసీపీ అడ్రస్‌ గల్లంతయ్యేలా వ్యూహాలు అమలు చేస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో కలిసి వెళ్లిన వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో వైసీపీకి వరుస షాక్‌లు.. టీడీపీలో చేరిన వైసీపీ ప్రజాప్రతినిధులు..!
Kuppam Politics
Follow us
Raju M P R

| Edited By: Balaraju Goud

Updated on: Jul 31, 2024 | 9:29 PM

కుప్పంలో టీడీపీ రివర్స్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసింది. టీడీపీని ఖాళీ చేస్తామన్న వైసీపీపై కౌంటర్‌ ఎటాక్‌ మొదలు పెట్టింది. కుప్పంలో వైసీపీ అడ్రస్‌ గల్లంతయ్యేలా వ్యూహాలు అమలు చేస్తోంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో.. ప్రస్తుత టీడీపీ పాలనలోనూ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం హాట్‌టాపిక్‌గా మారుతోంది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడమే అందుకు కారణం. గత జగన్‌ పాలనలో కుప్పంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టి.. మెజార్టీ టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకున్నారు. అంతేకాదు.. టీడీపీ అడ్డాగా ఉన్న కుప్పంలో అనూహ్య రాజకీయాలతో ఆ పార్టీని ఖాళీ అయ్యే పరిస్థితులకు తీసుకొచ్చారు. ఫలితంగా.. స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ ఓడి వైసీపీ ఘన విజయం సాధించింది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఏకంగా.. కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగురవేయడం సంచలనం సృష్టించింది. కానీ.. మొన్నటి ఎన్నికలతో సీన్‌ రివర్స్‌ అయింది. కూటమి సర్కార్‌ అధికారంలోకి రావడంతో కుప్పం రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆ నియోజకవర్గంలో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే.. పలువురు వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరగా.. తాజాగా.. ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లతోపాటు పలువురు ఎంపీటీసీలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో కలిసి వెళ్లిన వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

ఇక.. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంపై టీడీపీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. కుప్పంలో వైసీపీ ఖాళీ అయ్యేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. దాంతో.. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. కుప్పం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు దశలవారీగా టీడీపీలో చేరుతున్నారు. త్వరలో మరికొందరు వైసీపీ నేతలు.. టీడీపీలో చేరనున్నట్లు అధికార పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. మొత్తంగా.. ఓటమి తర్వాత ఏపీలో వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కీలక నియోజకవర్గాల్లోని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పి.. అధికార పార్టీ గూటికి చేరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..