Andhra Pradesh: పరిశ్రమల స్థాపనకు పూర్వ వైభవం.. నూతన ఇండస్ట్రియల్ పాలసీకి శ్రీకారం

పరిశ్రమల శాఖలపై సమీక్షలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 100 రోజుల్లో నూతన ఇండస్ట్రియల్ పాలసీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పూర్వ వైభవం రాబోతుందని చెప్పారు పరిశ్రమల శాఖమంత్రి భరత్.

Andhra Pradesh: పరిశ్రమల స్థాపనకు పూర్వ వైభవం.. నూతన ఇండస్ట్రియల్ పాలసీకి శ్రీకారం
Chandrababu On New Industrial Policy
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 31, 2024 | 10:12 PM

పరిశ్రమల శాఖలపై సమీక్షలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 100 రోజుల్లో నూతన ఇండస్ట్రియల్ పాలసీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పూర్వ వైభవం రాబోతుందని చెప్పారు పరిశ్రమల శాఖమంత్రి భరత్.

దేశంలోనే ఉత్తమ పారిశ్రామక విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొస్తున్నట్లు చెప్పారు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ. భరత్‌. పరిశ్రమల శాఖపై అమరావతిలో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. సమావేశానికి మంత్రి టీజీ భరత్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఐదు కొత్త పాలసీల రూపకల్పనకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఓర్వకల్లు, కృష్ణపట్నం, ఏపీ బల్క్‌డ్రగ్‌ పార్క్‌, కడప జిల్ల కొప్పర్తిలో క్లస్టర్లు ఉండగా…మరో 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్‌ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి టీజీ భరత్. పారిశ్రామిక ప్రోత్సహకాలపై సానుకూల ఉన్నామని.. మల్లవల్లి కారిడార్‌లో భూముల ధరల తగ్గింపుపై సీఎం సమీక్షించినట్లు మంత్రి భరత్ చెప్పారు.

వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిన పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు మంత్రి భరత్. 2014-19 వరకు చంద్రబాబు హయాంలో ఏపీలో పారిశ్రామిక విధానానికి ఆకర్షితులైన అనేక మంది పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఇండస్ట్రీయల్‌ పాలసీ, ఎంఎస్‌ఎంఈ , క్లస్టర్‌ పాలసీని 45 రోజుల్లో తీసుకువస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారని వెల్లడించారు మంత్రి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..