Prakasam District: హాస్టల్‌ బాత్‌రూమ్‌లో ప్రసవించిన ఇంటర్ విద్యార్థిని

Prakasam District: హాస్టల్‌ బాత్‌రూమ్‌లో ప్రసవించిన ఇంటర్ విద్యార్థిని

Ram Naramaneni

|

Updated on: Aug 01, 2024 | 8:38 AM

కొత్తపట్నం మండలం మోటుమాల కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో బాత్రూంలో బాలిక ప్రసవించింది. అయితే పసికందు చనిపోయింది. బాలికను లైంగికంగా లొంగదీసుకున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ప్రకాశం జిల్లా మోటుమాల కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని బాత్రూమ్‌లో ప్రసవించింది. అయితే పసికందు ప్రాణాలు కోల్పోయింది.  వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినిని లైంగికంగా లొంగదీసుకున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థిని రెండు నెలల నుంచి మోటుమాల వద్ద ఉన్న కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుందని  అధికారులు తెలిపారు. విద్యాలయంలో చేరినప్పటికే బాలిక గర్భం దాల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

 

Published on: Aug 01, 2024 08:34 AM