Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: అడ్డు చెబితే అంతే.. కర్నూలులో రంకెలు వేస్తోన్న రౌడీయిజం.. జనంపై దాడులు చేస్తూ హల్‌చల్..

కర్నూలులో రౌడీయిజం రంకెలు వేస్తోంది. పాతికేళ్ళు కూడాలేని యువకులు చదువు సంధ్యలు లేక రోడ్లపై జులాయిగా తిరుగుతూ రౌడీయిజానికి అలవాటు పడుతోన్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గతంలో ఏపీ తెలంగాణాల్లో ఇలాంటి ఆకతాయి రౌడీలు చెలరేగిపోయారు. ఇప్పుడు, తాజాగా కర్నూలులో రౌడీమూకల దౌర్జన్యాలు సీసీటీవీ కెమెరాల్లో చిక్కాయి.

Kurnool: అడ్డు చెబితే అంతే.. కర్నూలులో రంకెలు వేస్తోన్న రౌడీయిజం.. జనంపై దాడులు చేస్తూ హల్‌చల్..
Rowdy Gang
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 24, 2023 | 9:30 AM

కర్నూలులో రౌడీయిజం రంకెలు వేస్తోంది. పాతికేళ్ళు కూడాలేని యువకులు చదువు సంధ్యలు లేక రోడ్లపై జులాయిగా తిరుగుతూ రౌడీయిజానికి అలవాటు పడుతోన్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గతంలో ఏపీ తెలంగాణాల్లో ఇలాంటి ఆకతాయి రౌడీలు చెలరేగిపోయారు. ఇప్పుడు, తాజాగా కర్నూలులో రౌడీమూకల దౌర్జన్యాలు సీసీటీవీ కెమెరాల్లో చిక్కాయి. కర్నూలులో ఒకే రౌడీ గ్యాంగ్ ఆదివారం మూడు చోట్ల దాడులకు తెగబడింది. నగర శివారు పసుపుల దగ్గర రౌడీల హల్చల్‌ చేశారు. జనంపైనా, చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వారిపైనా పట్టపగలే దాడులకు తెగబడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. జగదీశ్వర్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై విచక్షణా రహితంగా దాడి చేసింది రౌడీ గ్యాంగ్‌. ఓ టీ దుకాణంలోకి చొరబడి.. ఆ వ్యక్తి మొహంపై పిడిగుద్దులు కురిపిస్తూ.. ప్లేట్స్ తోనూ, కాళ్ళతోనూ దాడికి తెగబడుతోన్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఏకంగా గ్యాస్ సిలిండర్నే ఎత్తి దాడిచేసేందుకు సిద్ధమయ్యాడు రౌడీ. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అదే గ్యాంగ్ బి.తాంద్రపాడు లో నాగరాజు అనే వ్యక్తి పై దాడికి దిగాడు. నాగరాజుకి తీవ్ర గాయాలయ్యాయి. బి.తాంద్రపాడులోని పోలీస్‌ స్టేషన్‌కి కూతవేటు దూరంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ వాచ్‌మెన్, కాలేజీ స్టాఫ్ ముగ్గురి పై వరుసగా దాడులకు దిగింది ఇదే రౌడీ గ్యాంగ్‌. అకారణంగా దాడి చేసిన వారిని శిక్షించాలంటూ వీడియో సాక్ష్యాలతో సహా నూతన ఎస్పీ కృష్ణకాంత్ కి ఫిర్యాదు చేశారు సీపీఎం నాయకులు.

డోన్ పట్టణంలో మళ్లీ రెచ్చిపోయిన యువకులు..

డోన్ పట్టణంలో సైతం రౌడీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. వరుసగా జనంపై దాడులకు దిగుతూ పోలీసులకు సవాల్ గా మారింది. మాదన్న నగర్ కాలనీ వద్ద రోడ్డుపై గొడవకు దిగింది. తాగిన మైకంలో యువకుల రంకెలు వేశారు. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకోవడంతో.. పలువురికి గాయాలయ్యాయి. దీంతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..