AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: పిచ్చుకల మనుగడ కోసం వినూత్న ఆలోచన.. ఆకట్టుకుంటున్న మాస్టారు ప్రయత్నం..

సమాజంలోచాలా మంది జంతుప్రేమికులు ఉన్నారు, వీరికి పక్షులు, జంతువులు అంటే ఎంతో ఇష్టం. వీరు సమయం దొరికినప్పుడల్లా వాటితో గడిపేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు వాటిని తెచ్చుకొని పెట్స్‌లా పెంచుకుంటారు. ఇలాంటి వారు పక్షులు, జంతువులకు ఏదైనా ఆపద వస్తే తట్టుకోలేరు.. వాటి సమస్య తీర్చేందుకు తమవంతు కృషిని చేస్తుంటారు. తాజాగా అంతరించిపోతున్న పిచ్చుకల మనుగడను పెంచడం కోసం ఒక ఉపాధ్యాయుడు వినూత్నం ప్రయత్నం చేస్తున్నాడు. అందేటో తెలుసుకుందాం పదండి.

Andhra News: పిచ్చుకల మనుగడ కోసం వినూత్న ఆలోచన.. ఆకట్టుకుంటున్న మాస్టారు ప్రయత్నం..
Andhra News
Pvv Satyanarayana
| Edited By: Anand T|

Updated on: Sep 24, 2025 | 5:12 PM

Share

పిచ్చుకలు అంతరించ పోకుండా ఉండాలి అని రిటైర్డ్ ఉపాధ్యాయుడు విన్నుతంగా శ్రమిస్తున్నాడు. రైతుల దగ్గర నుండి వరి పంట సేకరించి వాటిని అందంగా కుంచెలుగా తయారుచేసి ప్రతి గ్రామంలో వుండే దేవాలయాలు, పాఠశాలలులో కడుతు అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఈ విదంగా ఏర్పాటు చేయడం వల్ల పిచ్చుకులుకు ఆహారం దొరుకుతుంది. తద్వారా పిచ్చుకలు జాతి అభివృద్ధి చెందుతాయి అని మాస్టర్ చెబుతున్నారు.

కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు దాలినాయడు 2019 లో పదవి విరమణ చేసారు. అయన పదవి విరమణ దగ్గర నుండి పిచ్చుకలు అంతరించ పోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదట వరి పంటతో ఈ కుంచెలు కట్టడం ఒక రైతు దగ్గర నేర్చుకొని.. తరవాత తనే స్వయంగా కుంచెలు కట్టడం మొదలుపెట్టారు. వీటిని తుని పరిసర ప్రాంతాలు దేవాలయాలు, పాఠశాలలు కట్టడం మొదలుపెట్టారు. తరువాత తన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కు ఈ విద్య నేర్పించారు. హరిత వికాస్ ఫౌండేషన్ ఏర్పాటు గ్రామాలులో వుండే మహిళలుకు పక్షులకు కుంచలు కట్టడం నేర్పించారు. తరువాత రాష్ట్ర మొత్తం తిరుగుతూ అందరికి ఈ కుంచెలు కట్టడం నేర్పిస్తున్నారు.

పిచ్చుకలు అంతరించిపోకూడనే ఉద్దేశం మొదట రైతులు దగ్గర నుండి వరి పంట సేకరించి ఈ కుంచెలు కట్టేవాడినని ఆయన తెలిపారు. తరువాత నాకున్న భూమిలో వరి సాగు చేస్తు ఈ కార్యక్రమం చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అన్నదాతలతో కలిసి ఏర్పాటు చేస్తే రైతులకు మంచి అవకాశాలు ఏర్పడుతాయి. అని ఆయన అంటున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..