Dwaraka Tirumala: గోవిందా! ఆ తిప్పలేదో నువ్వే పడు స్వామీ.. హుండీ నిండా పింక్ నోట్లే.. భక్తులతో మామూలుగా ఉండదు మరి..!
ఓపిక లేకా? లేదా అతితెలివా?. రెండు వేల నోట్లు ఆర్బిఐ ఉపసంహరించుకున్న నాటినుంచి బ్యాంక్‌లకు బధులు హుండీలను ఆశ్రయిస్తున్న భక్తులు. దేవుడి హుండీలో వేసి చేతులు దులుపుకుంటున్నారు. రెండువేల నోట్లు మార్చుకునే భారాన్ని దేవునికి వదిలేస్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కడో.. ఏ దేవుడికో చూద్దాం.
ఓపిక లేకా? లేదా అతితెలివా?. రెండు వేల నోట్లు ఆర్బిఐ ఉపసంహరించుకున్న నాటినుంచి బ్యాంక్‌లకు బధులు హుండీలను ఆశ్రయిస్తున్న భక్తులు. దేవుడి హుండీలో వేసి చేతులు దులుపుకుంటున్నారు. రెండువేల నోట్లు మార్చుకునే భారాన్ని దేవునికి వదిలేస్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కడో.. ఏ దేవుడికో చూద్దాం.
రెండువేల రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకున్నది మొదలు.. బీరువాల్లో దాచిన ఆ నోట్లను ఒక్కోక్కటిగా బయటికి తీస్తున్నారు ప్రజలు. సెప్టెంబర్ వరకు గడువు ఉండడంతో వాటిని మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే తరుణంలో ఆనోట్లు బ్యాంకుల్లో కాకుండా హుండీల్లో జమచేస్తున్నారు. వాటిని మార్చుకునే వీలులేకనో మరి.. వదిలించుకునేందుకు ప్రత్యామ్నాయంగానో ఆలయ హుండీల్లో రెండు వేల నోటును జమ చేస్తున్నారు. తాజాగా ద్వారకా తిరుమల చిన వెంకన్న హుండీలో పెద్ద మొత్తంలో రెండు వేల నోట్లు ప్రత్యక్షమవుతున్నాయి. హుండీ లెక్కింపులో లెక్కింపులో పెద్ద మొత్తంలో రెండు వేల నోట్లను చూసిన సిబ్బంది షాకయ్యారు.
రెండు వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయంతో.. భక్తులంతా 2 వేల నోట్లను హుండీల్లో వేస్తున్నారని చెప్తున్నారు ఆలయ సిబ్బంది. బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకునేందుకు వీలుపడక స్వామికి కానుకగా వేస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుంది. ఉపసంహరించుకన్న 15 రోజుల్లో 3,288 రెండు వేల నోట్లను ఇప్పటివరకు హుండీలో వేశారు భక్తులు. వీటి విలువ రూ. 7.76 లక్షలుగా ఉంది. రెండు వేల నోట్ల ఉపసంహరణకు ముందు ఎప్పుడు హుండీ లెక్కించినా 2 వేల నోట్లు 40కి మించేవి కావని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అలాగే భక్తులు 2 వేల నోట్లతో ప్రసాదాలు కొని, మొక్కులు చెల్లించుకుంటున్నారని చెబుతున్నారు ఆలయ సిబ్బంది.
గతంలోను పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో దాదాపు 40లక్షల రూపాయలు దేవస్థానం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కూడా 2వేల నోట్లు వస్తుండటంతో ఆలయాధికారులు అవాక్కవుతున్నారు. ఇక రెండు వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకుంటే ఆదాయపన్ను శాఖ కిందికి వెళ్తాము అనే అపోహతో జనం ఎక్కువగా ఈ నోట్లను ఈవిధంగా ఖర్చు చేయడానికి ఆసక్తి చూపిన్నట్లు తెలుస్తుంది. వాటిని మార్చేందుకు పెట్రోల్ బంక్‌లు, షాపింగ్ మాల్స్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..