AP Weather Alert: ఈ రెండు రోజులు జాగ్రత్త.. ముఖ్యంగా వీరు ఇంటి నుంచి బయటకు రావొద్దు!
ఆంధ్రప్రదేశ్‌లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే భగ్గుమంటున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే భగ్గుమంటున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావారణ శాఖ హెచ్చరించింది. 302 మండలాల్లో ఈ ప్రభావం ఉందని చెప్పారు. కోనసీమ జిల్లాలోని పామర్రు మండలంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది వాతవరణశాఖ. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్ర, శనివారం రెండురోజులపాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్. ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఓవైపు ఎండలు.. మరోవైపు అకాస్మిక వర్షాలు ఏపీ ప్రజలను ఇబ్బందిపెడుతున్నాయి. రాయలసీమ జిల్లాలో కురిసిన అకాల వర్షం, పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. ఏపీలోని రాయలసీమ జిల్లాలో పలు చోట్ల వాన బీభత్సం సృష్టించింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం విరుపాపురంలో విషాదం చోటుచేసుకుంది. బైక్ లపై పెళ్లికి వెళ్లి వస్తుండగా భారీ వర్షం కురిసింది. వర్షం నుండి తట్టుకునేందుకు చెట్టుకిందకి వెళ్లగా పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా డీ. హిరేహాల్ మండలంలో కురిసిన భారీ వర్షానికి సోమలాపురం గ్రామం వద్ద వాగు పొంగింది. దీంతో రాయదుర్గం- బళ్ళారి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బొమ్మనహల్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో పూర్తిగా కాలిపోయింది. తిరుపతి భారీ వర్షం దంచికొట్టింది. ఈదురు గాలులతో కురిసిన వర్షంతో ఒక్కసారిగా శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం ముందు భారీ వృక్షం నేలకొరిగింది. చెట్టు కింద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. తాత్కాలికంగా స్వామి వారి దర్శనం నిలిపివేశార అధికారులు. అటు ఆలయం ముందు కూలిన చెట్టును పరిశీలించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ ముగ్గురిని వివరాలు అడిగితెలుసుకున్నారు. మృతుని కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా టిటిడి తరపున ఇస్తామని హామీ ఇచ్చారు చైర్మన్. చనిపోయిన వ్యక్తి కడప జిల్లా గురప్ప గా గుర్తించారు.
అటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వర్షం దంచికొట్టింది. పిడుగుపాటుకు రెండు ఆవులు మరణించాయి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వడగండ్ల వానతో పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలను తలపించాయి రహదారులు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి పుట్టపర్తిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో చీకటితో ఇబ్బంది పడ్డారు పుట్టపర్తి వాసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..