RGV: నాతో మాట్లాడించొద్దు.. ఆ ‘పదం’ అర్థం తెలీదన్న రామ్ గోపాల్ వర్మ..

వివాదాస్పద దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఏపీ రాజకీయాల్లో కలకలానికి కారణమైన 'పదం' మీద స్పందించేందుకు నిరాకరించారు. తనకు ఆ పదం అర్థం తెలీదని

RGV: నాతో మాట్లాడించొద్దు.. ఆ 'పదం' అర్థం తెలీదన్న రామ్ గోపాల్ వర్మ..
RGV

Ramgopal Varma: వివాదాస్పద దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఏపీ రాజకీయాల్లో కలకలానికి కారణమైన ‘పదం’ మీద స్పందించేందుకు నిరాకరించారు. తనకు ఆ పదం అర్థం తెలీదని తనను దీనిపై మాట్లాడించే ప్రయత్నం చేయించొద్దని రామ్ గోపాల్ వర్మ విలేకరులను కోరారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో కొండా సినిమా షూటింగ్ చేసిన వర్మ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘బోసడీకే అనే పదానికి అర్థం తెలియదు.. డిక్షనరీలు చూసేంత టైం లేదు. చాలామంది మాట్లాడేశారు… నాతో మాట్లాడించవద్దు.’ అని విలేకరుల ప్రశ్నకు సమాధానాన్ని వర్మ దాటవేశారు.

ఇలా ఉండగా, ఆర్జీవీ ఏపీ నాయకులు త్వరలోనే బాక్సింగ్, కరాటే నేర్చుకోవాలంటూ ఇటీవల కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత పట్టాభిరామ్ వైసీపీ నేతల టార్గెట్గా చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య కొత్త రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వర్మ సోషల్ మీడియాలో ట్వీటారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే… త్వరలోనే ఏపీ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్రసాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని రాము ట్వీట్ చేశారు.

Read also:  Minister Anil Kumar Yadav: సీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు: మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్

Click on your DTH Provider to Add TV9 Telugu