Sankranti Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి పది స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే..
Sankranti 2022 - Special Trains: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల కోసం
Sankranti 2022 – Special Trains: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ, లింగంపల్లి నుంచి విజయవాడ, విశాఖపట్నం, నర్సాపూర్, కాకినాడ ప్రాంతాలకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈనెల 7, 14న కాచిగూడ – విశాఖపట్నం, 8, 16వ తేదీన విశాఖపట్నం-కాచిగూడ, 11న కాచిగూడ – నర్సాపూర్, 12న నర్సాపూర్- కాచిగూడ, 19, 21న కాకినాడ టౌన్ – లింగంపల్లి , 20, 22న లింగంపల్లి – కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
కాచిగూడ – విశాఖపట్నం స్పెషల్ ట్రైన్: మల్కాజ్‌గిరి, చర్లపల్లి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడ – నర్సాపూర్ ట్రైన్: మల్కాజ్‌గిరి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది. కాకినాడ టౌన్ – లింగంపల్లి ట్రైన్: సామర్లకోట, రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుందని రైల్వే ప్రకటనలో తెలిపింది.
10 Sankranti Special Trains between various destinations#Sankranthi2022 #specialtrains pic.twitter.com/Ohzify0irc
— South Central Railway (@SCRailwayIndia) January 1, 2022
Also Read: