Honey Badger: అభయారణ్యంలో అరుదైన హానీబాడ్జర్.. రుచికరమైన ఆహారంకోసం ఎంతదూరమైన పయనించే గుణం దీని సొంతం..
Rare Honey Badger: కడప జిల్లాలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో అరుదైన నీబాడ్జర్ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఒంటిమిట్ట మండలం..
Rare Honey Badger: కడప జిల్లాలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో అరుదైన హనీబాడ్జర్ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె కసినకుంట సమీపంలో ఈ హనీబాడ్జర్ సంచరిస్తుందని అధికారులు తెలిపారు. అభయారణ్యంలో అరుదైన జంతువులు, వన్యప్రాణుల కదలికలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.
ముఖ్యంగా నాలుగో విడత జాతీయ పులుల గణన కోసం గత ఏడాది డిసెంబర్ 9న శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కొన్ని చోట్ల అధునాతన కెమెరాలు అటవీయే శాఖ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆ కెమెరాలో నమోదైన చిత్రాలను అధికారులు పరిశీలించినప్పుడు ..హనీబాడ్జర్ కనిపించింది. వాస్తవానికి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం విశిష్టమైనది. ఎందుకంటే అంతరించిపోతున్న పక్షి జాతులు , అంతరించిపోతున్న వృక్ష జాతుల తో పాటు గంథం చెక్కలను కలిగి ఉంది. అయితే ఈ అభయారణ్యం తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణం వలన తీవ్రంగా దెబ్బతింది. మళ్ళీ ఈ అడవుల్లో హనీ బ్యాడ్జర్ కనిపించడంపై అటవీశాఖ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ హనీ బ్యాడ్జర్, ప్రపంచంలోని ఇతర ప్రదేశాలతో పాటు భారత ఉపఖండంలో కూడా కనిపిస్తుంది. ఇది వీసెల్ కుటుంబానికి చెందినది. ఈ హనీ బ్యాడ్జర్ ఆహారప్రియురాలు.. రుచికరమైన పదార్ధం కోసం ఎంతదూరమైనా వెళ్తుంది. సాధారణంగా నలుపు , తెలుపు రంగుల్లో హనీ బ్యాడ్జర్ ఉంటుంది. హానీ బాడ్జర్ల లు 12 ఉపజాతులు కలిగి ఉన్నాయి. అయితే వీటి రంగులు ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క రంగులో విభిన్నంగా ఉంటాయి.
Also Read: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాల..