India Omicron: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..

India Omicron: మళ్ళీ  దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగున్న నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను తాత్కాలిక ఆసుప‌త్రుల‌ను ప్రారంభించాల‌ని, హోమ్ ఐసోలేషన్‌లో..

India Omicron: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..
Corona Virus India
Follow us

|

Updated on: Jan 01, 2022 | 8:04 PM

India Omicron: మళ్ళీ  దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగున్న నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను తాత్కాలిక ఆసుప‌త్రుల‌ను ప్రారంభించాల‌ని, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న రోగులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కోరింది. కరోనా కేసులు పెరుగుతున్నందున ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ శనివారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. దీనితో పాటు, జిల్లా స్థాయిలో లేదా స్థానికంగా కంట్రోల్ రూమ్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో అన్ని రాష్ట్రాలు నిర్ధారించుకోవాలని సూచించారు.

దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులను ఎదుర్కోవటానికి.. రాష్ట్రాలు ఆరోగ్య సదుపాయాలను పెంచాలని,  తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆరోగ్య కార్యదర్శి లేఖలో  రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. దీని కోసం DRDO , CSIR లతో పాటు ప్రైవేట్ రంగాలు, NGOల సహకారం తీసుకోవచ్చునని తెలిపారు. రానున్న రోజుల్లో కరోనా బారిన పడిన రోగులు పెద్ద సంఖ్యలో హోమ్ ఐసోలేషన్‌లో ఉండవచ్చు… కనుక ఇలాంటి  కేసులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని  అవసరం ఉందని రాజేష్ భూషణ్ చెప్పారు.  అవసరం అయితే అత్యవసర చికిత్స అందించేందుకు రెడీగా ఉండేలా చూడాలని సూచించారు.

అన్ని రాష్ట్రాలు హోమ్ ఐసోలేషన్ లోని కేసులను పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని లేఖలో సూచించారు.  కరోనా నిర్ధారణ కోసం చేసే పరీక్షలు, అంబులెన్స్‌లు, హాస్పిటల్ బెడ్‌ల గురించి ప్రజలకు సమాచారం ఇవ్వవలసి ఉంటుందని ఆయన అన్నారు. “ప్రజలు అంబులెన్స్‌కి కాల్ చేసి కాల్ చేసేలా ఏర్పాట్లు చేయాలని..  హాస్పిటల్ బెడ్‌లు పారదర్శకంగా అందుబాటులో ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని కోరారు. ఆక్సిజన్ , మందులు, అవసరమైన వైద్య సామాగ్రి లభ్యతను రాష్ట్రాలు క్రమం తప్పకుండా సమీక్షించవలసి ఉంటుందని తెలిపారు.

ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి అన్ని నివారణ చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య కార్యదర్శి అన్నారు.  అంతేకాదు క్వారంటైన్ సౌకర్యాలను పెంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్ (సోకిన వ్యక్తితో పరిచయం ఉన్న వ్యక్తులను గుర్తించడం) అవసరం ఉందని తెలిపారు.

‘కోవిడ్-19 పరీక్షల కోసం .. 

ఎవరికైనా జ్వరం, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, శ్వాస ఆడకపోవడం, శరీరక ఇబ్బందులు వంటి సమస్యలు ఉన్నట్లు అనిపించినా.. నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, అలసట , విరేచనాలు వంటి లక్షలు ఉంటే.. ఆ వ్యక్తిని కోవిడ్-19 అనుమానిత రోగిగా పరిగణించాలని ఎయిమ్స్ వైద్య అధికారులు సూచించారు.

వివిధ ప్రదేశాలలో కోవిడ్-19 పరీక్షల కోసం 24 గంటల బూత్‌లను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఈ బూత్‌లలో COVID-19 నిర్ధారణ కోసం 24 గంటలూ యాంటిజెన్ పరీక్ష సదుపాయాన్నికల్పించాలని..  రోగుల కోసం స్వదేశీంగా తయారు చేసిన టెస్ట్ కిట్‌లను ఉపయోగించేలా ఆరోగ్య కార్యకర్తలను ప్రోత్సహించాలని కేంద్రం.. రాష్ట్రాలను కోరింది.

దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య

దేశంలో, ఒకే రోజులో 22,775 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది అక్టోబర్ 6  తర్వాత అత్యధికం.  మరోవైపు    కొత్త వేరియంట్ ‘ఓమిక్రాన్’  161 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కొత్త వేరియంట్ కు బారిన పడిన వారి సంఖ్య 1,431 కు చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధికంగా 454 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి, ఢిల్లీలో 351, కేరళలో 118 మరియు గుజరాత్‌లో 115 కేసులు నమోదయ్యాయి.

Also Read:  అష్టా చమ్మా కేక్‌తో న్యూ ఇయర్‌కి స్వాగతం… నెట్టింట వైరల్‌ అవుతున్న వెరైటీ కేక్‌