PM Narendra Modi: ప్రధాని మోదీకి తిరుమల, శ్రీశైలం వేదపండితుల ఆశీర్వచనం.. వీడియో..
Priests meets PM Modi: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవాలయాల అర్చకులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని
Priests meets PM Modi: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవాలయాల అర్చకులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి ఆశీర్వచనలు అందజేశారు. కొత్త సంవత్సరంలో తొలిరోజు శనివారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న ప్రఖ్యాత ఆలయాల పండితులు.. ప్రధాని మోదీని కలిసి వేదాశీర్వచనం అందించారు. దీంతోపాటు శేష వస్త్రాలతో పాటు ఆలయాల నుంచి తమ వెంట తీసుకెళ్లిన తీర్ధప్రసాదాలను ప్రధానికి బహూకరించారు.
ఇదిలాఉంటే.. నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం అందరి జీవితాల్లో సుఖ సంతోషాల్ని, ఆయూరారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. మనం సాధించిన ప్రగతిని, శ్రేయస్సును ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంతో పాటు మన స్వాతంత్ర్య సమరయోధుల కలల్ని సాకారం చేసేందుకు మరింత కష్టపడి పని చేద్దామంటూ ప్రధాని పిలుపునిచ్చారు.
వీడియో..
#WATCH | Priests from Tirupati and Srisailam temples met Prime Minister Narendra Modi and gave him ‘prasad’ from the temples, in New Delhi today pic.twitter.com/H4ghFCmOS8
— ANI (@ANI) January 1, 2022
Also Read: