Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulivendula: సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా పులివెందుల పాలిటిక్స్.. సతీష్ రెడ్డి ఇంటికి క్యూ కట్టిన నేతలు

పులివెందులలోని మాజీ తెలుగుదేశం పార్టీ నేత వైఎస్ కుటుంబ రాజకీయ ప్రత్యర్థి సతీష్ రెడ్డి ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారా.రు గత నాలుగు నెలల పైగా టీడీపీకి దూరంగా ఉన్న సతీష్ రెడ్డి, ఇప్పుడు పులివెందులలో హాట్ టాపిక్ అయ్యారు. నాలుగున్నరలుగా ఏ పార్టీలో చేరకుండా స్తబ్దతగా తన పని తాను చేసుకున్న సతీష్ రెడ్డి వైపు ఇప్పుడు వైసీపీ, టీడీపీ నేతలు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే ఆయన ఇంటికి క్యూ కట్టారు ఇరు పార్టీల నేతలు.

Pulivendula: సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా పులివెందుల పాలిటిక్స్..  సతీష్ రెడ్డి ఇంటికి క్యూ కట్టిన నేతలు
Satish Reddy Btech Ravi
Follow us
Sudhir Chappidi

| Edited By: Balaraju Goud

Updated on: Feb 25, 2024 | 3:03 PM

పులివెందులలోని మాజీ తెలుగుదేశం పార్టీ నేత వైఎస్ కుటుంబ రాజకీయ ప్రత్యర్థి సతీష్ రెడ్డి ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారా.రు గత నాలుగు నెలల పైగా టీడీపీకి దూరంగా ఉన్న సతీష్ రెడ్డి, ఇప్పుడు పులివెందులలో హాట్ టాపిక్ అయ్యారు. నాలుగున్నరలుగా ఏ పార్టీలో చేరకుండా స్తబ్దతగా తన పని తాను చేసుకున్న సతీష్ రెడ్డి వైపు ఇప్పుడు వైసీపీ, టీడీపీ నేతలు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే ఆయన ఇంటికి క్యూ కట్టారు ఇరు పార్టీల నేతలు

కడప జిల్లాలోని సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. తన రాజకీయ ప్రత్యర్థైన సతీష్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవాలంటూ సీఎం కడప జిల్లా నేతలకు సూచించడంతో వైసీపీ నేతలు సతీష్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలంటూ ఆహ్వానించా.రు అయితే ఆ విషయంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుని తెలియజేస్తానని చెప్పటంతో.. అటు తెలుగుదేశం పార్టీ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు. వెంటనే టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారు. ఆదివారం తెల్లవారుజామునే సతీష్ రెడ్డి నివాసానికి చేరుకుని టీడీపీలోనే కొనసాగాలంటూ మంతనాలు చేశారు. అయితే వారితో కూడా సతీష్ రెడ్డి చాలా సున్నితంగా మాట్లాడి కార్యకర్తల నిర్ణయం మేరకు తన నిర్ణయాన్ని తెలియజేస్తానని చెప్పారు.

అయితే గత కొంతకాలంగా పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న బీటెక్ రవి వ్యుహంలో భాగంగానే సతీష్ రెడ్డిని కావాలనే పార్టీకి దూరం చేశాడని స్థానిక టీడీపీ నేతలు అంటున్నారు. బిటెక్ రవి సతీష్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళాడో తెలియడంలేదని అతని వర్గం అంటున్నారు. గత నాలుగున్నర ఏళ్ళుగా లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు సతీష్ రెడ్డిపై పుట్టుకొచ్చిందో అందరికీ తెలుసని ఎద్దేవా చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సతీష్ రెడ్డి అవసరం ఉంది. అందుకే ఆయన దగ్గరకు వెళ్లారని సతీష్ రెడ్డి వర్గం మండిపడుతోంది. గత నాలుగేళ్లుగా సతీష్ రెడ్డిని కలుపుకోకపోగా ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్నాడని బీటెక్ రవిపై ధ్వజమెత్తారు.

పులివెందులలోని తెలుగుదేశం పార్టీ కిందిస్థాయి నేతలను దూరం పెడుతూ తన సొంత మండలం అయిన సింహాద్రిపురంలోనే తన నాయకత్వాన్ని నిలుపుకోలేకపోతున్నారని బీటెక్ రవిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు టీడీపీకి దశాబ్దాల కాలం పాటు సేవ చేసి పార్టీకి అండగా నిలబడి అక్కడే అవమానించబడ్డ సతీష్ రెడ్డిని కలవడానికి రావడం పై ఇదంతా ఎన్నికల కోసమేనని సతీష్ రెడ్డి వర్గం అంటుంది. ఏ పార్టీలో చేరాలి అనే విషయంపై కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపిన సతీష్ రెడ్డి, రెండు రోజుల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించనున్నా.రు అయితే సతీష్ రెడ్డి టీడీపీ వైపు కన్నా వైసీపీ వైపే మొగ్గుచూపుతున్నట్లు సతీష్ రెడ్డి వర్గం అంటుంది. ఏది ఏమైనా పార్టీ కోసం నిలబడిన సతీష్ రెడ్డిని కావాలని అవమానించిన టీడీపీ నేతలపై గుర్రుగా ఉన్నారు ఆయన వర్గీయులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….