Pet Dog Missing: తెల్లవారేసరికి నగరమంతా ఫ్లెక్సీలే.. అసలేం జరిగింది.? వీడియో వైరల్
ఇటీవల ప్రతి చిన్న కార్యక్రమానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. శుభకార్యాలు, రాజకీయ నాయలకుల పర్యటనలు, పండుగలు, జాతరలు, ఆఖరికి ఎవరైనా చనిపోయినా ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఇదొక ట్రెండ్‌గా మారిపోయింది. సాధారణంగా ఎవరైనా వ్యక్తులు తప్పిపోతే పోస్టర్ వేసి అక్కడక్కడా అతికిస్తారు.. పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు. కానీ ఒక కుక్క తప్పిపోతే ఫ్లెక్సీలు పెట్టడం ఎక్కడైనా చూశారా..?
ఇటీవల ప్రతి చిన్న కార్యక్రమానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. శుభకార్యాలు, రాజకీయ నాయలకుల పర్యటనలు, పండుగలు, జాతరలు, ఆఖరికి ఎవరైనా చనిపోయినా ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఇదొక ట్రెండ్‌గా మారిపోయింది. సాధారణంగా ఎవరైనా వ్యక్తులు తప్పిపోతే పోస్టర్ వేసి అక్కడక్కడా అతికిస్తారు.. పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు. కానీ ఒక కుక్క తప్పిపోతే ఫ్లెక్సీలు పెట్టడం ఎక్కడైనా చూశారా..? అవును ఓ వ్యక్తి పెంపుడు కుక్క తప్పిపోవడంతో దానికోసం నగరమంతా ఫ్లెక్సీలు పెట్టేసాడు. ఈ విచిత్ర సంఘటన గుంటూరుజిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది. నర్సరావుపేట వినుకొండలోని తాళ్లూరి నగర్‌కు చెందిన బొంతా సువర్ణ రాజు ఐదేళ్ల క్రితం గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్క పిల్లను కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. దానికి య్యాచీ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం య్యాచీకి ఐదేళ్లు. ఆ కుటుంబంలో య్యాచీ ఓ సభ్యుడిగా మారిపోయింది. అయితే గత ఆదివారం య్యాచీ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఎప్పటి లాగా రాత్రి భోజనం పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారిన తర్వాత చూస్తే య్యాచీ కనపడలేదు. కుటుంబ సభ్యలందరూ టౌన్ మొత్తం గాలించిన య్యాచీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందారు. య్యాచీ ఫోటోతో ప్లెక్స్ వేయించారు. దాదాపు వంద ప్లెక్సీలను నగరం మొత్తం తెల్లవారేసరికి ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో య్యాచీ ఫోటోతో పాటు సువర్ణ రాజు అడ్రస్, ఫోన్ నంబర్ సైతం ఇచ్చారు.
ఫ్లెక్సీలతోపాటు తెలుగు, ఇంగ్లీష్‌లో పోస్టర్‌లు కూడా ఏర్పాటు చేశాడు. అయినా య్యాచీ ఆచూకీ తెలియలేదు. దీంతో య్యాచీని ఎవరో దొంగిలించి ఉంటారని సువర్ణరాజు కుటుంబం అనుమానం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా య్యాచీని కుటుంబ సభ్యుడిలా పెంచుకున్న శునకం కనిపించకపోవడం ఆ కుటుంబమంతా విలపిస్తున్నారు. చేసేదిలేక పోలీసులను ఆశ్రయించారు. అయితే పట్టణంలో పెద్ద ఎత్తున వెలిసిని ప్లెక్స్ లను చూసిన స్తానికులు ఈ ఘటనపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఎవరైనా కుటుంబ సభ్యులు అదృశ్యమైతే వేయాల్సిన ప్లెక్సీలు ఒక కుక్కకోసం వేయడంపై వింతగా చూస్తున్నారు. త్వరలోనే య్యాచీ దొరకాలని కోరుకుంటున్నారు. కొందరు ఫోన్ చేసి మరీ ఆ కుటుంబాన్ని ఓదార్చుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..