Red Light Therapy: రెడ్‌లైట్ థెరపీతో మధుమేహానికి చెక్.! లండన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి.
ఇటీవల కాలంలో మధుమేహం చాలామందిని ఇబ్బంది పెడుతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ పట్టి పీడిస్తోంది. అయితే మధుమేహానికి రెడ్‌లైట్ థెరపీతో చెక్ పెట్టవచ్చంటున్నారు పరిశోధకులు. మధుమేహానికి రెడ్‌లైట్ థెరపీ అంటే ఎరుపు రంగు కాంతితో అడ్డుకట్ట వేయొచ్చని తాజా అధ్యయనం ఒకటి నిరూపించింది. భోజనం తర్వాత మన శరీరంపై 15 నుంచి 45 నిమిషాలపాటు ఎరుపురంగు కాంతి పడేటట్టు చేయడం ద్వారా..
ఇటీవల కాలంలో మధుమేహం చాలామందిని ఇబ్బంది పెడుతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ పట్టి పీడిస్తోంది. అయితే మధుమేహానికి రెడ్‌లైట్ థెరపీతో చెక్ పెట్టవచ్చంటున్నారు పరిశోధకులు. మధుమేహానికి రెడ్‌లైట్ థెరపీ అంటే ఎరుపు రంగు కాంతితో అడ్డుకట్ట వేయొచ్చని తాజా అధ్యయనం ఒకటి నిరూపించింది. భోజనం తర్వాత మన శరీరంపై 15 నుంచి 45 నిమిషాలపాటు ఎరుపురంగు కాంతి పడేటట్టు చేయడం ద్వారా మధుమేహానికి చెక్‌పెట్టవచ్చని లండన్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఓ ప్రముఖ బయోఫోటోనిక్స్ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురించారు. రెడ్ లైట్ థెరపీ ద్వారా మైటోకాండ్రియాలో 670 నానోమీటర్ల ఉత్తేజిత శక్తి ని ఉత్పత్తి చేయగలిగితే అది గ్లూకోజ్ వినియోగానికి దారితీస్తుందని తేలింది. మరీ ముఖ్యంగా గ్లూకోజ్ తీసుకున్న తర్వాత 27.7 శాతం గ్లూకోజ్ స్థాయులు తగ్గినట్టు కనుగొన్నారు. గరిష్ఠంగా గ్లూకోజ్ పెరుగుదలను 7.5 శాతం తగ్గించింది. శరీరంపై ఎరుపురంగు కాంతి పడగానే జీవకణంలోని మైటోకాండ్రియా ఉత్తేజితమై వెంటనే శక్తిని విడుదల చేయడం మొదలుపెడుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ మైఖేల్ పానర్ పేర్కొన్నారు. భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయులు అమాంతం పెరగకుండా ఇది అడ్డుకుంటుందని వివరించారు. ఎల్ఈడీ లైట్లలో నీలిరంగు కాంతి ఆరోగ్యానికి హాని చేస్తుందని, నీలంరంగు కాంతికి శరీరం ఎక్కువసేపు గురికావడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయులు డిస్ రెగ్యులేషన్‌కు గురవుతాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎల్ఈడీ లైట్ల వినియోగం పెరగడంతో ఈ ముప్పును గుర్తించాలని సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

