Guinness world Record: ముక్కులో 68 అగ్గిపుల్లలతో గిన్నిస్ రికార్డ్.! వీడియో వైరల్..
ప్రపంచ రికార్డు నెలకొల్పడమే లక్ష్యంగా కొందరు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అందుకు ఎంతో పట్టుదలతో కృషి చేస్తారు. తాజాగా ఓ వ్యక్తి తన రెండు ముక్కులలో అగ్గిపుల్లలు జొప్పించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. డెన్మార్‌కు చెందిన పీటర్ వాన్ టాంజెన్ బుస్కోవ్ ముక్కులో ఏకంగా 68 అగ్గిపుల్లలు దూర్చుకుని ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డు ఓ ప్రకటన చేసింది.
ప్రపంచ రికార్డు నెలకొల్పడమే లక్ష్యంగా కొందరు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అందుకు ఎంతో పట్టుదలతో కృషి చేస్తారు. తాజాగా ఓ వ్యక్తి తన రెండు ముక్కులలో అగ్గిపుల్లలు జొప్పించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. డెన్మార్‌కు చెందిన పీటర్ వాన్ టాంజెన్ బుస్కోవ్ ముక్కులో ఏకంగా 68 అగ్గిపుల్లలు దూర్చుకుని ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డు ఓ ప్రకటన చేసింది. ముక్కులో అత్యధిక సంఖ్యలో అగ్గిపుల్లలు దూర్చుకున్న తొలి వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడని వెల్లడించింది. గిన్నిస్ రికార్డ్స్ నిబంధనల ప్రకారం, ముక్కులో కనీసం 54 పుల్లలు దూర్చుకుంటే ఈ రికార్డుకు అర్హులు. తనకీ అసాధారణ రికార్డు దక్కడంపై పీటర్ హర్షం వ్యక్తం చేశాడు. అన్ని పుల్లలు దూర్చుకున్నా పెద్దగా నొప్పి కలగలేదని తెలిపాడు. తన ముక్కుపుటాలు పెద్దవిగా ఉంటాయని, బాగా సాగుతాయని వెల్లడించాడు. ఇలాంటి రికార్డు కోసం ప్రయత్నించాలన్న ఆలోచన అనుకోకుండా కలిగిందని అతడు చెప్పాడు. చిన్నతనంలోనూ ఇలాంటి పనులు చేసినట్టు గుర్తులేదని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో తన రికార్డును తానే బద్దలుకొట్టే అవకాశం లేకపోలేదని తెలిపాడు. అవసరమైతే అందుకు తగిన ట్రైనింగ్ కూడా తీసుకుంటానని తెలిపాడు. వయసు పెరిగే కొద్దీ ముక్కు కూడా పెద్దదవుతుంది కాబట్టి మరో రికార్డు నెలకొల్పే ఛాన్స్ ఉందని తెలిపాడు. ఈ రికార్డు జనాలను కొత్త ప్రయత్నాలవైపు ప్రోత్సహించాలని ఆశిస్తున్నట్టు చెప్పాడు. లైఫ్‌లో ఆస్వాదించేందుకు ఎంతో ఉందని తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..

