Andhra Pradesh: పులసలా మజాకా.. ఒక్కో చేప ఎంత ధర పలికిందో తెలిస్తే నోరెళ్లబెడతారు..

Andhra Pradesh: కేంద్రపాలిత ప్రాంతమైనా యానాం నియోజకవర్గంలో ఈరోజు సూమరు రెండు కెజీలపైగా బరువు ఉన్న గోదావరి పులసలు రెండు దర్శనమిచ్చింది.

Andhra Pradesh: పులసలా మజాకా.. ఒక్కో చేప ఎంత ధర పలికిందో తెలిస్తే నోరెళ్లబెడతారు..
Pulasa Fish
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 03, 2021 | 6:36 AM

Andhra Pradesh: కేంద్రపాలిత ప్రాంతమైనా యానాం నియోజకవర్గంలో ఈరోజు సూమరు రెండు కెజీలపైగా బరువు ఉన్న గోదావరి పులసలు రెండు దర్శనమిచ్చింది. అరుదుగా దొరికే ఈ పులస కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. ఇటీవల వచ్చిన గోదావరి వరద నీరుకు ఎదురీదితూ సముద్రంలో నుండి గోదావరిలోకి వచ్చి మరింత రుచిని ఇస్తుంది ఈ పులస చేప. ఈ ఎడాది ఇప్పటికే సగం పులసలు రావలసి ఉండగా ప్రస్తుతం వాటి జాడలేదు. ఇటీవల గోదావరి పులసల పేరుతో పలుచోట్ల ఒరిస్సా నుండి వచ్చిన పులసల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం గోదావరిలో మత్స్యకారులు వేటకు వెళితే వారంలో ఒకటి లేదా రెండు చోప్పున వలలో పడటం జరుగుతుంది.

ఇటివలే యానాం గౌతమీ గోదావరీలో మార్కెట్ వద్దకు గోదావరి ఒరిజినల్ సెనా పులస ఓక్కటి వచ్చింది. రెండు కేజీల బరువు ఉన్న చేప 20,000 వేలకు మాత్రమే వెళ్ళింది. అదే అతి ఎక్కువ ధర అనుకున్న తరుణంలో తాజాగా మరో రెండు పులసలు దానికి మించిపోయిన రేటు పలికాయి. యానాం మార్కెట్ వద్దకు గోదవరి ఒరిజినల్ సెనా పులసలు రెండు రావడంతో పులస ప్రియులు కొనడానికి ఎగబడ్డారు. వీటిలో కొద్దిపాటి తేడాతో ఒకటి 25 వేలు, మరొకటి 23 వేల ధరకు అమ్ముడయ్యాయి. రెండు కెజీలకు పైగా బరువున్న చేపను కొల్లు నాగలక్ష్మీ 23,000 లకు. మరో చేపను పట్టా భాగ్యలక్ష్మీ 25000కు పాడి.. ఇరవై నిమిషాల వ్యవధిలో ఆ పులసలను ఇరువురు పాడిన పాటపై కోంత మొత్తం ఇచ్చి కొనుక్కుని పట్టుకుపోయారు. యానాం గౌతమీ గోదావరీలో ఇంత రేటు పలికిన తోలి పులసగా దీనిని చెప్పవచ్చు అంటున్నారు స్థానికులు.

Also read:

Silver Price Today: దేశీయంగా వెండి ధరలు పెరిగితే.. హైదరాబాద్‌లో తగ్గింది.. ఎంతంటే..

Aadhaar Card: ఈ సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి అని మీకు తెలుసా?.. పూర్తి వివరాలివే..

Ice Cream Tester: ఐస్ క్రీమ్ తినడమే ఇతని పని.. జీతం మాత్రం కోట్లలో.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజుల్ ఔట్..