Ice Cream Tester: ఐస్ క్రీమ్ తినడమే ఇతని పని.. జీతం మాత్రం కోట్లలో.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజుల్ ఔట్..
Ice Cream Tester: ఐస్ క్రీమ్‌ను ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ ఐస్ క్రీమ్‌ని ఆస్వాధిస్తారు. అయితే, ఐస్ క్రీమ్ కు
Ice Cream Tester: ఐస్ క్రీమ్‌ను ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ ఐస్ క్రీమ్‌ని ఆస్వాధిస్తారు. అయితే, ఐస్ క్రీమ్ కు సంబంధించిన విభిన్న రుచులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నిత్యం కొత్త రుచులు కూడా మార్కెట్లో విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ విభిన్న రుచుల ఐస్ క్రీమ్స్.. మార్కెట్లో ఎలా వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరు ఆ ఐస్‌క్రీమ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో తెలుసా? అన్నింటికంటే ముఖ్యంగా ఐస్ క్రీమ్ కొత్త రుచిని మార్కెట్‌లోకి తీసుకురావడానికి ముందు ఏ వ్యూహం అమలు చేస్తారో తెలుసా? ఒక ఐస్ క్రీమ్ బయటకు రావాలంటే ఖచ్చితంగా ఒకరి అనుమతి అవసరం. మరి ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా అనేక బ్రాండ్లు, రుచుల ఐస్ క్రీమ్‌లు ఉన్నాయి. కానీ పలానా బ్రాండ్‌లను అత్యుత్తమ ఐస్ క్రీమ్ ఫ్లేవర్‌గా వర్ణించిన ఏకైక వ్యక్తి అమెరికాకు చెందిన జాన్ హారిసన్. జాన్ ఐస్ క్రీమ్ రుచి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. మార్కెట్లో ఐస్ క్రీమ్ కొత్త రుచి ప్లేవర్ వచ్చినందంటే చాలు.. అది జాన్ నాలుకను తాకల్సిందే. అతని సమ్మతి తరువాతే అది మార్కెట్‌లోకి వస్తుంది. అయితే, ఈ పని కోసం జాన్ అక్షరాలా కోటి రూపాయల జీతం తీసుకుంటాడు. 1942 లో జన్మించిన జాన్‌కు ఐస్‌క్రీమ్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. జాన్ తాత ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీని నడిపేవాడు. అతను అప్పుడు ఐస్ క్రీమ్ టేస్టర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. వివిధ రకాల ఐస్‌క్రీమ్‌లను రుచి చూడటం, ఏదైనా తేడా ఉంటే దానిని మెరుగుపరిచే మార్గాలను సూచించడం వంటివి చేస్తుండేవాడు. అయితే, ఈ లక్షణాలు జాన్‌కు కూడా వచ్చాయి. అదే అతనికి ప్లస్ పాయింట్ అయ్యింది.
200 మిలియన్ గ్యాలన్ల ఐస్ క్రీమ్‌ని పరీక్షించారు.. జాన్ హారిసన్ 1956 లో ఐస్ క్రీమ్ తయారు చేసే డ్రేయర్ కంపెనీలో చేరాడు. జాన్‌కు మొదట్లో ఐస్‌క్రీమ్ టెస్టర్ ఉద్యోగం లభించకపోయినప్పటికీ, అతని సూచనలు ఐస్ క్రీమ్ రుచిగా ఉండేలా చేశాయి. ఆ తర్వాత అతనికి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ టెస్ట్ చేసే ఉద్యోగం వచ్చింది. జాన్ డ్రేయర్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో అతను 200 మిలియన్ గ్యాలన్ల కంటే ఎక్కువ ఐస్ క్రీమ్‌ను పరీక్షించాడట. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్.. తాను ప్రతీ రోజూ 20 రకాల ఐస్ క్రీమ్ లను రుచిచూసేవాడినని చెప్పుకొచ్చాడు. ప్రతీ టేస్ట్‌కి 3 నుంచి 4 సెలక్షన్స్ ఉంటాయన్నాడు. ఈ విధంగా ప్రతీ రోజూ 60 రకాల ఐస్ క్రీమ్‌లను 5 గంటల పాటు రుచి చూసిన తరువాత.. జాన్ ఆ ఐస్ క్రీమ్‌ను మార్కెట్‌కు తీసుకెళ్లడం సరైందా? కదా? అని చెప్పేవాడు.
బంగారు పూతతో చేసిన స్పూన్‌తో ఐస్ క్రీమ్ పరీక్ష.. జాన్ ఐస్ క్రీమ్‌ను పరీక్షించే స్పూన్‌ను బంగారం పూతతో తయారు చేశారు. కారణం ఐస్ క్రీమ్ రుచి ప్రభావితం కాకుండా ఉండేందుకట. జాన్ ఐస్ క్రీమ్ పరీక్ష చేస్తున్నప్పుడు దానిని పూర్తిగా తినడు. రుచి చూసిన తరువాత వెంటనే ఉమ్మివేస్తాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. జాన్ తన స్వీయ అనుభవం ద్వారా ఏ వ్యక్తికి ఏ ఐస్ క్రీమ్ టేస్ట్ నచ్చుతుందో సునాయాసంగా చెప్పగలడు. ఐస్ క్రీమ్ రుచిలో నిపుణుడైన జాన్ హారిసన్ తన నాలుకను 2 మిలియన్ డాలర్లకు బీమా చేశాడు. జాన్ నాలుక ప్రత్యేకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతని నాలుక, రుచి గ్రంధులు సామాన్యుడి నాలుక కంటే 11.5 శాతం సన్నగా ఉంటాయి. దీని కారణంగా మిగిలిన వాటి కంటే ఏదైనా ఐస్ క్రీం రుచిని బాగా ఆస్వాధిస్తారు. జాన్ హారిసన్ 2010 లో పదవీ విరమణ చేశారు. కానీ ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.
Also read:
Funny Samosa: ఇలాంటి సమోసాను మీ జీవితంలో చూసి ఉండరు.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తోన్న ఫోటో..
Gold News: బంగారం కొనుగోలు చేస్తున్నారా?.. ఈ మూడు మార్కులను తప్పక చూడండి.. లేదంటే అంతే సంగతులు..
Maharashtra: 8 నెలల ఎంజాయ్ చేశాడు.. రూ. 25 లక్షల బిల్లు చేశాడు.. ఆ తరువాత బాత్రూమ్ కిటీకీ నుంచి..