AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: రెండు రోజులుగా ఆకలితో అలమటించి చిన్నారి మృతి? సీఎం చంద్రబాబు ఆరా..

రెండున్నరేళ్ల లక్షిత్ అనే చిన్నారి రెండు రోజులుగా కనిపించకుండా పోయి, చివరకు మృతదేహంగా కనిపించాడు. అంగన్వాడీ కేంద్రం నుండి పోయిన లక్షిత్ ఆచూకీ కోసం పోలీసులు గాలించారు. ఆహార, నీటి లేమితో అతడు మృతి చెందినట్లు అంచనా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

AP: రెండు రోజులుగా ఆకలితో అలమటించి చిన్నారి మృతి? సీఎం చంద్రబాబు ఆరా..
Cm Chandrababu
SN Pasha
|

Updated on: Jul 10, 2025 | 10:48 PM

Share

ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో రెండు రోజులుగా కనిపించకుండా పోయిన రెండున్నరేళ్ల చిన్నారి లక్షిత్ చివరకు మృతదేహంగా కనిపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషాదకర ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎలా జరిగింది?

రెండు రోజుల క్రితం చిన్నారి లక్షిత్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం నుంచి బయటకు వెళ్లిన తర్వాత కనిపించలేదు. అంగన్వాడీ సెంటర్ నుంచి బయలుదేరిన లక్షిత్ తిరిగి ఇంటికి రాలేదు. అప్పటినుంచి ఆందోళనలో ఉన్న కుటుంబం, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

ఆచూకీ కోసం ప్రత్యేక బలగాలు

లక్షిత్ ఆచూకీ కోసం డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో ట్రాకింగ్, డ్రోన్ల ద్వారా గాలింపు చేపట్టిన పోలీసులు, అడవిలో ప్రయాణించి ఆహార, నీటి లేమితో మృతి చెందినట్టు ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఎస్పీ సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. అంగన్‌వాడీ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే ప్రత్యేక దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు