ఎరుపు రంగు మామిడి పండు గురించి తెలుసా? దీని టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు!
Samatha
07 April 2026
మామిడిపండ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా మామిడిపండ్లను తింటుంటారు.
మామిడిపండ్లు
అన్ని పండ్లలో కెళ్లా మామిడి పండ్లు చాలా అద్భుతమైన రుచిని ఇస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంటారు.
అద్భుతమైన రుచి
చాలా వరకు మామిడి పండ్లు పసుపు రంగు, ఆకు పచ్చ రంగులో మాత్రమే ఉంటాయి. మరి మీరు ఎప్పుడైనా ఎరుపు రంగు మామిడి పండ్లను చూశారా? దీని గురించి తెలుసుకుందాం.
ఎరుపు రంగు
ఎరుపు రంగు మామిడిపండ్లను మియాజాకీ మామిడిపండ్లు అంటారు. ఇవి భారత దేశంలోని బిహార్ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తుంటారు.
మియాజాకీ పండ్లు
ఈ మామిడి పండు రుచి చూడాలి అంటే తప్పకుండా పెట్టి పుట్టాలంట. అంత అద్భుతంగా ఉంటుందంట. తిన్న ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందేనంట.
అద్భుతమైన రుచి
ఈ మియాజాకి మామిడి పండ్లు పఎరుపు రంగులో, రూబీ రంగులో ఉంటాయి. అంతే కాకుండా వీటి రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందట.
ఎరుపు, రూబీ కలర్
వీటి ఖరీదు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఒక్క మామిడి పండు ధర రూ.100 ఉంటుందంట. ఇక కిలో ధర రూ. 3 లక్షల వరకు ఉంటుందంట.
ఖరీదు ఎక్కువే
ఈ మామిడి పండు 550 గ్రాముల బరువుతో ఉంటాయి. అలాగే, వీటిని బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లాలోని మసౌర్హి బ్లాక్ లో ఉన్న కొరియవన్ గ్రామంలో మాత్రమే సాగు చేస్తారంట. దీనిని సూర్యుని పండు అని కూడా అంటారంట.