AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఉచిత బస్సులో డ్యూటీ చేస్తున్న పాపానికి దెబ్బలు తిన్నాడు ఓ కండక్టర్. ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళను టికెట్ తీసుకోవాలని చెప్పినందుకు కండక్టర్ చంప పగలగొట్టిన ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది.. విజయవాడలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో, స్థానిక వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత కండక్టర్లకు, మహిళా ప్రయాణికులకు మధ్య జరుగుతున్న వరుస ఘర్షణల్లో ఇది మరొకటి.

బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Passenger Issues,
Vasanth Kollimarla
| Edited By: |

Updated on: Apr 07, 2026 | 9:25 AM

Share

విజయవాడ నగరంలో ఆర్టీసీ బస్సులో జరిగిన ఒక వింత సంఘటన చర్చనీయాంశమైంది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి టికెట్ జారీ చేసే క్రమంలో కండక్టర్, మహిళా ప్రయాణికురాలి మధ్య జరిగిన ఘర్షణ పోలీస్ స్టేషన్ వరకు చేరింది. విజయవాడ నుండి విస్సన్నపేట వెళ్లే ఆర్టీసీ బస్సు నెం. 308 లో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్నారు. ఉచిత టికెట్ కోసం వారు కండక్టర్‌కు ఆధార్ కార్డులు చూపించాల్సి ఉండగా, ఇద్దరు మహిళలు కలిసి మూడు ఆధార్ కార్డులను కండక్టర్‌కు అందించారు. మీరు ప్రయాణిస్తుంది ఇద్దరే కదా, మూడు కార్డులు ఎందుకు ఇస్తున్నారు? అని కండక్టర్ ప్రశ్నించారు. ఈ చిన్న ప్రశ్న కాస్తా పెద్ద వివాదానికి దారితీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా, ఆగ్రహానికి గురైన మహిళ అందరి ముందే కండక్టర్ చెంపపై లాగి కొట్టింది.

తన సిబ్బందిపై దాడి జరగడంతో స్పందించిన డ్రైవర్, బస్సును ఏమాత్రం ఆపకుండా నేరుగా నున్న పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదని నున్న పోలీసులు చెప్పడంతో, ప్రయాణికులతో సహా బస్సును సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పోలీసుల విచారణలో మహిళా ప్రయాణికురాలు మాట్లాడుతూ.. కండక్టర్ తనను అసభ్య పదజాలంతో దూషించారని, అందుకే చేయి చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీనిని కండక్టర్ ఖండించారు. తాను కేవలం టికెట్ నియమాల గురించి మాట్లాడానని తెలిపారు. ఈ వివాదంతో సంబంధం లేని మిగతా ప్రయాణికులు మిట్ట మధ్యాహ్నం ఆకలితో అలమటిస్తూ స్టేషన్ దగ్గర పడిగాపులు కాయాల్సి వచ్చింది. వారి గొడవలో మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? అంటూ ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇరు వర్గాల నుండి స్టేట్‌మెంట్లను సేకరించి విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us