Andhra Pradesh Crime: సినీ ఫక్కీలో భార్యను హతమార్చిన భర్త.. అనాథలైన పసివాళ్లు!
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను సినీ ఫక్కిలో చంపేశాడో భర్త. ఆపై ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడా ఘనుడు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మానేపల్లి సమీపంలోని నాగార్జున సాగర్ కాలువ కట్టపై పూజల శ్రీను, తన భార్య కోటేశ్వరితో బైక్ పై వెళుతూ ఒక్కసారిగా బైక్ ను కాలువలోకి తోసేశాడు. దీంతో నీటి ప్రవాహంలో బైక్ తోపాటు కోటేశ్వరి గల్లంతు కాగా శ్రీను ఈదుకుంటు నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చాడు. ఆ తరువాత ముందుగా వేసుకున్న..

పుల్లలచెరువు, అక్టోబర్ 15: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను సినీ ఫక్కిలో చంపేశాడో భర్త. ఆపై ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడా ఘనుడు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మానేపల్లి సమీపంలోని నాగార్జున సాగర్ కాలువ కట్టపై పూజల శ్రీను, తన భార్య కోటేశ్వరితో బైక్ పై వెళుతూ ఒక్కసారిగా బైక్ ను కాలువలోకి తోసేశాడు. దీంతో నీటి ప్రవాహంలో బైక్ తోపాటు కోటేశ్వరి గల్లంతు కాగా శ్రీను ఈదుకుంటు నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చాడు. ఆ తరువాత ముందుగా వేసుకున్న తన ప్లాన్ ను లో భాగంగా తన బంధువులతో పాటు భార్య బంధువులకు ఫోన్ చేసి ప్రమాదవశాత్తు కాలువలో పడటం వలన భార్య, బైక్ కొట్టుకుని పోయాయని చెప్పాడు. ఘటనా స్ధలానికి వచ్చిన భార్య బంధువులు శ్రీను ప్రవర్తన పై అనుమానించి పుల్లలచెరువు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాగర్ కాలువ దగ్గరకు వచ్చిన పోలీసులు శ్రీను ను యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ సీఐ మారుతీ కృష్ణ నిందితుడు శ్రీనును తనదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు బయట పెట్టాడు.
కుటుంబ కలహాల నేపథ్యంలో ప్లాన్ ప్రకారం తన భార్యను బైక్ ఎక్కించుకుని కాలువలోకి దూసుకెళ్ళానని ఆ తరువాత తాను ఈదుకుంటూ బయటకు వస్తుండగా,తాను తనని పట్టుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా ఇదిలించుకుని కాలువ నుండి ఒడ్డుకు చేరానని శ్రీను చెప్పినట్లు సిఐ మారుతీ కృష్ణ తెలిపారు. ఈ క్రమంలో కాలువలో గల్లంతైన కోటేశ్వరి కోసం పోలీస్ లు బంధువులు గాలిస్తుండగా త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం వద్ద కాలవలో శవమై తేలియాడుతూ కనిపించింది. కాలువ నుంచి కోటేశ్వరి శవాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం యర్రగొండపాలెం లోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీనును పూర్తిగా విచారించి సమాచారం ఇస్తామని సిఐ మారుతీ కృష్ణ తెలిపారు.
పుల్లలచెరువు మండలం సిద్ధనపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరి ని ఏడు సంవత్సరాల క్రితం పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రామాపురం కు చెందిన పూజల శ్రీను కు ఇచ్చి వివాహం జరిపారు. వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు. ఇటీవల శ్రీను కోటేశ్వరి మధ్య కలహాలు రావటంతో ప్లాన్ ప్రకారం భార్య కోటేశ్వరి ని శ్రీను ఈ విధంగా అంతమొందించాడు. దీంతో ఇద్దరు పిల్లలు తల్లి ప్రేమకు దూరమై ఆనాధలుగా మిగిలారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. భార్యతో కాపురం ఇష్టంలేక పోతే విడిపోతే పోయేది. ఏకంగా ఆమెను అంతమొందించడం వల్ల పిల్లలు అనాధలుగా మారారని బంధువులు వాపోతున్నారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.