Faction Attacks: మరోసారి తెరపైకి ఫ్యాక్షన్ రాజకీయాలు.. మృతిపై నిరసన చేస్తున్న బాధిత కుటుంబం..
నంద్యాల జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు హింసకు దారి తీశాయి. ఒకరు హత్యకు గురికాగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు పోలీస్ స్టేషన్ ముట్టడించారు. జాతీయ రహదారిని స్తంభింపజేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. డోన్ మండలం ఉంగరాణిగొండ్ల గ్రామంలో నిన్న రాత్రి ఘర్షణ జరిగింది. కావిడి ఎరకల ఖాదర్, వారి బంధువులపై ఉంగరాణిగుండ్లకు చెందిన చిన్న మద్ది తనయులు దాడి చేశారు.

నంద్యాల జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు హింసకు దారి తీశాయి. ఒకరు హత్యకు గురికాగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు పోలీస్ స్టేషన్ ముట్టడించారు. జాతీయ రహదారిని స్తంభింపజేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. డోన్ మండలం ఉంగరాణిగొండ్ల గ్రామంలో నిన్న రాత్రి ఘర్షణ జరిగింది. కావిడి ఎరకల ఖాదర్, వారి బంధువులపై ఉంగరాణిగుండ్లకు చెందిన చిన్న మద్ది తనయులు దాడి చేశారు. ఈ ఘటనలో ఖాదర్ మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఘర్షణలో ఐదుగురికి తీవ్ర గాయాలుకాగా ఒకరు కర్నూలు ఆసుపత్రికిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి 35 ఏళ్ల వయసు ఉంటుంది. అతనికి ముగ్గురు కుమారులు ఒకే కుమార్తె ఉంది. మృతడి బంధువులు రూరల్ స్టేషన్ ఎదుట కూర్చొని నిరసన తెలిపారు.
ఉంగరాణిగుండ్ల వైస్సార్సీపీ నాయకుడు చిన్నమద్ది తనయులు, చిగురామెన్ పేటకు చెందిన ఎరుకలి వర్గానికి పాత కక్షలు ఉన్నట్లు చెబుతున్నారు స్థానికులు. దీంతో గొడవ జరిగి ఎరకాలి కావడి ఖాదర్ మృతి మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోల్ బాటిల్ ఒంటిపై పోసుకొని పోసుకొని మృతికి కారణమైన వైఎస్సార్సీపీ నాయకుడిని.. అతని కుమారులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నేషనల్ హైవేని దిగ్భంధం చేసి దాదాపు గంట పైన నిరసన తెలుపుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున మృతుని బంధువులు, సన్నిహితులు తరలి వచ్చారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..