Coronavirus: భారత్‌లో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. ఏపీలో ఒక్కరోజే ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసా..?
కరోనావైరస్ కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల గ్రాఫ్ పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,394కు చేరుకుంది. కరోనా బారినపడి తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఒక్కరోజే 841 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి
కరోనావైరస్ కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల గ్రాఫ్ పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,394కు చేరుకుంది. కరోనా బారినపడి తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఒక్కరోజే 841 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో గత 227 రోజుల గరిష్ఠానికి కేసుల సంఖ్య పెరిగింది. అటు.. జేఎన్.1 వేరియంట్ దేశంలో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఈ వైరస్ కేసులు 196కి చేరుకున్నాయి. అత్యధికంగా కేరళ (83), ఆ తర్వాత గోవా (51), గుజరాత్ (34) లో కేసులు బయటపడ్డాయి.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తుండటం కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం ఒక్కరోజే 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికి 135 కేసులను గుర్తించారు. ఇక తెలంగాణలో కూడా దడ పుట్టిస్తుంది కరోనా. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులకు కోవిడ్ పాజిటివ్ తేలడంతో కోవిడ్ ప్రత్యేక వార్డులో చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. 20 బెడ్స్ తో ప్రత్యేకంగా పిడియాట్రిక్ కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. ఆరుగురికి పరీక్షలు నిర్వహించగా.. అందులో ముగ్గురు చిన్నారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు అలెర్ట్ అయ్యారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. పండుగ టైమ్‌లో మళ్లీ కరోనా హైరానా అందర్నీ హడలెత్తిస్తోంది. గుంపుల్లోకి వెళ్లొద్దు.. గుంపులుగా తిరుగొద్దు. ప్రతీ ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు వైద్యులు.. ప్రతీ ఒక్కరూ ఇమ్యూనిటీ పెంచుకోవాలంటున్నారు
మరోవైపు కరోనా కేసుల పెరుగుతోన్న క్రమంలో AP వైద్య శాఖ అప్రమత్తమైంది.రేపటి నుంచి రెండో దశ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం కాబోతుంది. కరోనా కేసుల పెరుగుతోన్న నేపథ్యంలో రెండోదశలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.. విశాఖ, కృష్ణా, తిరుపతి, బాపట్ల జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు. కేరళ వెళ్లొచ్చిన వారిలో కరోనా కేసులు కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు మాస్క్‌లు ధరించడం.. వ్యక్తి గత శుభ్రత పాటించడం చేయాలని చెబుతున్నారు వైద్యులు. బహిరంగ ప్రదేశాల్లో తప్పని సరిగా మాస్క్ మస్ట్‌గా వాడాలని సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..