Okka Chance Please: ఆంధ్రా సహా దేశవ్యాప్త రాయకీయాల్లో నయా ట్రెండ్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటోన్న పవన్, రాహుల్ గాంధీ..

ఏపీ రాజకీయాల్లో స్పీడు పెంచిన పవన్‌ నోటివెంట ఈ మాట రావడంతో.. మరోసారి ఈ డైలాగ్‌ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. దేశ రాజకీయాల్లో కొత్త ట్రెండు నడుస్తోంది.. కరోనా వైరస్‌లో వ్యాపించినట్లు ఇప్పుడు వన్‌ ఛాన్స్‌ ప్లీజ్‌ సర్వత్రా వినిపిస్తోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ నిజానికి ఇది ఖడ్గం మూవీలోని సినిమా డైలాగే

Okka Chance Please: ఆంధ్రా సహా దేశవ్యాప్త రాయకీయాల్లో నయా ట్రెండ్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటోన్న పవన్, రాహుల్ గాంధీ..
Okka Chance Please New Tren
Follow us
Surya Kala

|

Updated on: Nov 15, 2022 | 10:11 AM

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌… నేనేంటో నిరూపించుకుంటా..ఈ ఫేమస్‌ సూపర్‌ హిట్‌ సినిమా డైలాగ్‌ మీకు గుర్తుందా? కానీ, ఇదిప్పుడు పొలిటికల్‌ తెరపై పేలుతోంది. మామూలుగా కాదు… మాస్‌ మసాలాకు రెట్టించిన ఘాటుతో దుమ్మురేపుతోంది. సినిమాల్లో వేషం కోసం ఆర్టిస్టులు రిక్వెస్ట్ చేస్తే.. ఇప్పుడు  అధికారం కోసం రాజకీయ నాయకులు రిక్వెస్ట్ చేయడం సర్వసాధారణ అయిపోయింది. ప్లీజ్‌.. ప్లీజ్‌… ప్లీజ్‌… అంటూ మైకులు పగిలిపోయే రేంజ్‌లో రిక్వెస్టు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏపీ రాజకీయాల్లో స్పీడు పెంచిన పవన్‌ నోటివెంట ఈ మాట రావడంతో.. మరోసారి ఈ డైలాగ్‌ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. దేశ రాజకీయాల్లో కొత్త ట్రెండు నడుస్తోంది.. కరోనా వైరస్‌లో వ్యాపించినట్లు ఇప్పుడు వన్‌ ఛాన్స్‌ ప్లీజ్‌ సర్వత్రా వినిపిస్తోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ నిజానికి ఇది ఖడ్గం మూవీలోని సినిమా డైలాగే. కానీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదో కొత్త ట్రెండులా మారింది. అప్పుడెప్పుడో వచ్చిన ఖడ్గం సినిమాలో… హీరోయిన్‌గా ఒక్క ఛాన్స్‌ అంటూ .. నటి సంగీత చేసిన హంగామా ఇప్పటికీ అందరికీ గుర్తే. అయితే, అది సినిమాల వరకే పరిమితమైతే పర్లేదు. ఇప్పుడది చైనాలో పుట్టి ప్రపంచమంతా పాకిన కరోనా వైరస్‌లా… దేశ రాజకీయాల్లోకి చొచ్చుకొచ్చింది.

సినిమావాళ్లు పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి సూపర్‌ హిట్‌ అయిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. కానీ, ఎప్పటికీ సినిమాలు, రాజకీయాలు ఒక్కటి కానేకాదు. ఈ రెండు రంగాల్లో సక్సెస్‌ అనేది అందరికీ అంత ఈజీ కూడా కాదు. అందుకే.. వెండితెర మీదైనా, పొలిటికల్‌ స్క్రీన్‌ మీదైనా ఒక్క ఛాన్స్‌ అనేది చాలా కీలకమని అర్థమవుతోందిప్పుడు. సినిమాల్లో తనకంటూ ఒక స్టార్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న పవన్‌ కల్యాణ్‌… రాజకీయంగానూ తన సత్తా చూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేసి ఓడినా.. ఆయన రాజకీయాలను వదల్లేదు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. అధికార పక్షంతో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఇప్పుడు మరోమారు రాబోయే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

ఇటీవల విజయనగరం జిల్లా పర్యటనలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు.. పొలిటికల్‌ కారిడార్‌లో వన్‌ ఛాన్స్‌ ప్లీజ్‌ అనే ముచ్చను మరోసారి తెరమీదకు తీసుకొచ్చాయి. అధికారంలోకి రావడానికి ఒక్క అవకాశం ఇవ్వండి … నేనేంటో, నా పరిపాలనావిధానం ఏంటో చూపిస్తా… అంటూ పవన్‌ అభ్యర్థించడం పొలిటికల్‌గా మరోసారి చర్చకు దారి తీసింది. ఉత్తరాంధ్ర మీద ఒట్టు… మీ భవిష్యత్తుకు నాది భరోసా అంటున్నారు. విద్యనేర్పి.. సినిమా జీవితాన్ని ప్రసాదించిన ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగించాలంటూ… సెంటిమెంట్‌ అస్త్రాన్ని ప్రయోగించారు. అది ఎంత వరకు ఫలితాన్నిస్తుందో తెలియదు. కాకపోతే, గతానుభవాల దృష్ట్యా… ఈ డైలాగ్‌ పవర్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే వన్‌ ఛాన్స్ ప్లీజ్‌ అంటూ ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేసిన పొలిటికల్‌ ఘటనలు లేకపోలేదు.

ఇవి కూడా చదవండి

అంతెందుకు, 2014లో తృటిలో అధికారాన్ని కోల్పోయిన వైఎస్‌ జగన్‌… ప్రతిపక్ష నేతగా అప్పట్లో అందుకున్న స్లోగన్‌ ఇదే. నాటి టీడీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి ప్రజల్లోకి వెళ్లిన జగన్‌… ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. 3వేల 648 కిలోమీటర్ల దూరం నడిచి… రికార్డు సృష్టించారు. సొంత జిల్లా కడపలోని ఇడుపుల పాయ దగ్గర 2017 నవంబర్ 6న ఆరంభమైన ఈ పాదయాత్ర… 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం దగ్గర ముగిసింది. దెబ్బకు అధికారం ఆయన పక్షాన నిలిచింది.

సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేసిన పాదయాత్రలో ఆయన వాడిన ఒకే ఒక్క స్లోగన్‌ ఏంటో తెలుసా….? వన్‌ ఛాన్స్‌ ప్లీజ్‌. ఒక్క అవకాశం ఇస్తే… తన తండ్రి రాజశేఖర్‌ రెడ్డిని మించిన సంక్షేమ పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. ఒక్కటి మాత్రం నిజం… ”ఒక్క అవకాశం…ఒకే ఒక్క అవకాశం” అంటూ జగన్‌ చేసిన అభ్యర్థన ఏపీ ప్రజలపై బాగా పనిచేసింది. జగన్‌ గెలించేందుకు ఇదొక్కటే కారణమని చెప్పలేం గానీ… వేల కిలోమీటర్ల నడక, సంక్షేమంపై హామీలకు తోడు ఇది కూడా ఎంతో కొంత ఎఫెక్ట్‌ చూపిందన్నది మాత్రం వాస్తవం. అందుకే, పదేపదే ప్రతిపక్షాలు సైతం… ఒకే ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలో వచ్చాడని… జగన్‌ను అప్పుడప్పుడూ దెప్పిపొడుస్తూ, విమర్శిస్తూ ఉంటాయ్. ఆ డైలాగ్‌కు ఉన్న పవర్‌ అలాంటిది మరి.

టీడీపీ హయాంలో ఐటీ మంత్రిగా, పంచాయతీ రాజ్‌ మంత్రిగా… అసలు మొత్తంగా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నారాలోకేశ్‌… మంగళగిరిలోనూ ఇదే స్లోగన్‌ ఉపయోగించారు. ఒక్క అవకాశమివ్వండి… మీకు అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాను.. నన్ను నమ్మండి… అంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

కానీ, ఏం చేస్తాం.. బ్యాడ్‌ లక్‌. సేమ్‌ మంత్రం… బట్‌ జగన్‌ వేస్తే పనిచేసింది… లోకేశ్‌ వేస్తే మాత్రం సరిగ్గా పారలేదు. సీఎం కొడుకుగా ఉండి… ఎన్నికల్లో నిలబడినా ఓటమిని మూగట్టుకోక తప్పలేదు. బట్‌ ఓడినా.. మంగళగిరిలోనే తిష్టవేసి… తన వన్‌ చాన్స్‌ ప్లీజ్‌ అనే డైలాగ్‌ను పదేపదే వినిపిస్తూనే ఉన్నారు లోకేశ్‌. మరి, ఈసారైనా ఆయనను విజయం వరిస్తుందా? వన్‌ ఛాన్స్ ప్లీజ్‌ మంత్రం పనిచేస్తుందా? అన్నదే టీడీపీలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తి రేపుతోంది. త్వరలోనే ఆయన రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సైతం సిద్ధమవుతుండటంతో విషయం మరింత ఇంట్రస్టింగ్‌ మారింది.

ఏపీ రాజకీయాల్లోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లోనూ ఈ ట్రెండు నడుస్తోందిప్పుడు. రాష్ట్రంలో బీజేపీకి ఊపు తీసుకొచ్చిన కరీంనగర్‌ ఎంపీ, స్టేట్‌ పార్టీ ప్రెసిడెంట్‌ బండి సంజయ్‌ ఏం మాట్లాడినా దుమారమే అన్నట్టుగా మారింది పరిస్థితి. ఆ మధ్య ప్లీజ్‌ ప్లీజ్‌ అంటూ… ఓ నిండు సభలో సంజయ్‌ చేసిన రిక్వెస్టు బాగా వైరలైంది. బండి చేసిన రిక్వెస్ట్‌ కచ్చితంగా మామూలు రేంజ్‌ రిక్వెస్ట్‌కాదు. ఒక్కసారి అవకాశమివ్వండి… ఒకే ఒక్కసారి… అంటూ సంజయ్‌ చేసిన రిక్వెస్టుపై అపోనెంట్స్‌ నుంచి అదే రేంజ్‌లో సెటైర్లు పడ్డాయనుకోండి అది వేరే విషయం. కానీ, ఈ స్థాయిలో చేసిన రిక్వెస్టు ఇంపాక్ట్‌.. ఫ్యూచర్‌లో ఏమైనా ఉంటుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరం.

వన్‌ ఛాన్స్‌ ప్లీజ్‌.. అనేది, తెలుగు రాష్ట్రాలకే పరిమితమైందనుకుంటే పొరపడినట్టే. ఎందుకంటే, జాతీయస్థాయి రాజకీయాల్లోనూ ఇలాంటి అభ్యర్థనలే వినిపిస్తుండటం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా… భారత్‌ జోడో అంటూ… కన్యాకుమారి టు కశ్మీర్‌ పాదయాత్ర ప్రారంభించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ… యాత్ర మొదట్లో ఇలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం.

రాహుల్‌ గాంధీకి గానీ, ఆయన పార్టీకి గానీ.. అధికారం కొత్తకాదు. దశాబ్దాలుగా దేశాన్ని ఏలింది కాంగ్రెస్‌ పార్టీనే. అయితే, రాహుల్‌ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాక… 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ప్రభుత్వం అధికారంలో ఉన్నా… ప్రధానిపదవిలో మాత్రం మన్మోహన్‌ సింగ్‌ ఉన్నారు. సో… ఈసారి తనకు ప్రధానిగా అవకాశం ఇవ్వాలన్నది రాహుల్‌ రిక్వెస్ట్‌. తన హయాంలో కాంగ్రెస్‌ పాలన ఎలా ఉంటుందో చూడాలన్నది రాహుల్‌ విజ్ఞప్తిలోని సారాంశమన్నమాట. మరి, ఆ రిక్వెస్టును దేశప్రజలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారన్నది… 2024 ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.

ఏపీ రాజకీయాల్లో జనసేనానితో పాటు బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సైతం… వన్‌ చాన్స్‌ ప్లీజ్‌ అంటున్నారు. అటు టీడీపీ కీలక నేతగా నారా లోకేశ్‌ సైతం ఒక్క అవకాశం అంటున్నారు. ఇక ఇప్పటికే వన్‌ఛాన్స్‌ అంటూ అధికారం దక్కించుకుని గద్దెమీదున్నారు జగన్‌. ఇంకోవైపు దేశవ్యాప్తంగా నాకో ఛాన్స్ కావాలంటున్నారు రాహుల్‌గాంధీ. మరి, ప్రజలు ఈసారి ఎవరికి ఛాన్సిస్తారన్నది చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!