Tirupati Tension Live Updates: శ్రీవారి సన్నిధిలో పొలిటికల్ హీట్..టీడీపీ ‘ధర్మ పరిరక్షణ’ యాత్రకు అనుమతి రద్దు

| Edited By: Anil kumar poka

Updated on: Jan 21, 2021 | 2:48 PM

Politica High Voltage in Tirupati: తిరుపతిలో పొలిటికల్ హడావుడి నెలకొంది. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులకు వ్యతిరేకంగా.. అటు టీడీపీ, ఇటు జనసేన..

Tirupati Tension Live Updates: శ్రీవారి సన్నిధిలో పొలిటికల్ హీట్..టీడీపీ 'ధర్మ పరిరక్షణ' యాత్రకు అనుమతి రద్దు

Politica High Voltage in Tirupati: తిరుపతిలో పొలిటికల్ హడావుడి నెలకొంది. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు హడావుడి చేస్తున్నాయి. ధర్మ పరిరక్షణ పేరుతో తిరుపతి నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ర్యాలీ చేపట్టగా.. తిరుపతిలో జరిగే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన తిరుపతికి వస్తున్నారు. అయిేత పవన్ రాక నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికేందుకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుపతికి భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. తిరుపతి వేదికగా అటు పవన్.. ఇటు అచ్చెన్నాయుడు ఇద్దరూ ఒకేసారి కార్యక్రమాలు చేపడుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Jan 2021 01:09 PM (IST)

    టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు

    టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేశారు.  ర్యాలీకి ఇచ్చిన నిబంధనలు పాటించకుండా రోడ్డు మీద స్పీకర్లు ఏర్పాటు చేయడంతో..  బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అలిపిరి గరుడ వారధి వద్ద టెన్షన్ నెలకుంది.  భారీగా పోలీసులు మోహరించారు. అనుమతి ఇచ్చిన ఇవ్వకపోయినా కచ్చితంగా ర్యాలీ చేసి తీరుతామని టీడీపీ చెబతుంది. మరికాసేపట్లో  అచ్చెన్నాయుడు గరుడ సర్కిల్ వద్దకి చేరుకోనున్నారు.

  • 21 Jan 2021 12:46 PM (IST)

    పోలీసుల ఆంక్షలపై టీడీపీ నేతలు ఆగ్రహం

    ధర్మ పరిరక్షణ యాత్రను అడ్డుకోవడంపై  రూయా ఆసుపత్రి సర్కిల్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ధర్మపరిరక్షణ యాత్ర సందర్భంగా నిర్వహించ తలపెట్టిన బైక్ ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  మహతి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. యాత్రను అడ్డుకున్న పోలీసులు.. టీడీపీ నేతలను బలవంతంగా అరెస్టు చేశారు.

  • 21 Jan 2021 12:29 PM (IST)

    ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఆగ్రహం

    ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్మ పరిరక్షణ యాత్రను అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. యాత్రకు అనుమతి ఇచ్చిన పోలీసులు.. ఇలా అడ్డుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలిపిరి నుంచి ధర్మపరిరక్షణ యాత్రను టీడీపీ నేతలు ప్రారంభించారు. గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వంటి సీనియర్ నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు.  అయితే రోడ్డుపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి..బైక్ ర్యాలీ చేస్తూ.. బహిరంగ సభ దిశగా టీడీపీ అడుగులు వేయడంతో, ప్రచార రథాలను పోలీసులు అడ్డుకున్నారు.

  • 21 Jan 2021 12:15 PM (IST)

    ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో తిరుపతి ఉప ఎన్నికల నోటిఫికేషన్

    తిరుపతి కేంద్రంగా ప్రధాన పార్టీల రాజకీయాలు ఊపందుకున్నాయి. త్వరలో ఉప ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపధ్యంలో రాజకీయ హడావిడి బాగా పెరుగుతోంది. ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మరణంతో తిరుపతి బైపోల్స్‌ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఎప్పుడైనా ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ తిరుపతిపై పడింది.

  • 21 Jan 2021 12:10 PM (IST)

    ఏపీలో టెంపుల్‌ పాలిటిక్స్‌

    ఏపీలో టెంపుల్‌ పాలిటిక్స్‌ జోరందుకున్నాయి. ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి రథయాత్ర ప్రారంభిస్తామని కమలనాథులు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు టీడీపీ కూడా రంగంలోకి దిగింది. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి నిరసనగా ధర్మపరిరక్షణ యాత్ర పేరుతో జనంలోకి వెళ్లేందుకు ప్లాన్‌ చేసింది. ఎవరేం చేసినా... జగన్‌ సర్కార్‌ చేసిన అభివృద్ధి పనులే శ్రీరామరక్ష అంటోంది వైసీపీ. మొత్తంమీద తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నికే టార్గెట్‌గా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి.

  • 21 Jan 2021 12:06 PM (IST)

    తిరుపతిలో పొలిటికల్‌ హైవోల్టేజ్‌

    ఏపీలో జోరందుకున్న టెంపుల్‌ పాలిటిక్స్‌ తిరుపతి ఉప ఎన్నిక టార్గెట్‌గా వ్యూహాలు వచ్చేనెల 4 నుంచి బీజేపీ రథయాత్ర నేడు టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్ర దేవాలయాలపై దాడులను నిరసిస్తూ యాత్ర తిరుపతిలో టీడీపీ ర్యాలీ, సభ 7 నియోజకవర్గాల్లో యాత్ర 700 గ్రామాలు, 10 రోజులు యాత్ర టార్గెట్ హిందూత్వ ఎజెండాను భుజానేసుకున్న టీడీపీ ర్యాలీలకు అనుమతి లేదన్న పోలీసులు తిరుపతిలో పొలిటికల్‌ హైవోల్టేజ్‌

  • 21 Jan 2021 12:05 PM (IST)

    తిరుపతి పార్లమెంట్ ఎన్నిక ఎజెండాగా ఆ అంశం

    ఆలయాలపై దాడులకు వ్యతిరేకంగా తీవ్రస్వరం వినిపిస్తున్న టీడీపీ- హిందుత్వ అంశాన్ని భుజానికి ఎత్తుకుందా..? గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికలో కూడా ఇదే ఎజెండా అంటోంది.. తిరుమల పవిత్రతే  తమ ఎన్నికల ఎజెండా అంటున్నారు అచ్చెన్నాయుడు.

  • 21 Jan 2021 11:53 AM (IST)

    టీడీపీ శ్రేణులంతా రోడ్డెక్కి నిరసన తెలపండి: చంద్రబాబు

    టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంక్రటావ్ అక్రమ అరెస్టుకు నిరసనగా నేడు టీడీపీ శ్రేణులంతా రోడ్డెక్కి నిరసన తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో ఇవాళ ఉదయం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కళా వెంకటరావు సహా టీడీపీ శ్రేణులపై వైసీపీ అరాచకాలను ఖండించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాందోళనలు జరపాలని సూచించారు. వైసీపీ అరాచకాలకు కళా అరెస్టు పరాకాష్ఠ అని మండిపడ్డారు.

  • 21 Jan 2021 11:03 AM (IST)

    ఏపీ డీజీపీపై చంద్రబాబు ఫైర్

    రాష్ట్రంలో ఉన్మాది పాలన నడుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఫైరయ్యారు. కళా వెంకట్రావు చేసిన తప్పేంటో..డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వెళ్లి..రామతీర్థం ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు.  ప్రతిపక్ష నేతగా తనకు అనుమతి ఇచ్చి.. మళ్లీ  విజయసాయి రెడ్డిని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. లారీలు అడ్డుపెట్టి తనను అడుగడుగునా అడ్డుకున్నారని..రాముడి తల నరికితే చెప్పడం తప్పా అని ప్రశ్నించారు.

    రాష్ట్రంలో అమలు చేసేదిఇండియన్ పీనల్ కోడ్..జగన్ పీనల్ కోడా అంటూ ఫైరయ్యారు. తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతి ఇచ్చి..మళ్లీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.

  • 21 Jan 2021 10:35 AM (IST)

    పాదయాత్రకు అనుమతి తీసుకుని బైక్ ర్యాలీ ఏంటి: పోలీసులు

    ప్రజలకు, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా హడావిడి లేకుండా ర్యాలీకి మొదట పోలీసులు అనుమతిచ్చారు. అయితే దారి పొడవునా హోర్డింగులు, స్పీకర్లు ఏర్పాటు చేశారు టీడీపీ కార్యకర్తలు.  బైక్ ర్యాలీ చేసేందుకు కూడా సిద్దమయ్యారు. పాదయాత్రకు అనుమతి తీసుకుని బైక్ ర్యాలీ చేయడం సరికాదని పోలీసులు చెబుతున్నారు. అలిపిరి గేటు వద్ద బందోబస్తుని ఎస్పీ రమేష్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ మునిరామయ్య పరిశీలించారు.

  • 21 Jan 2021 10:32 AM (IST)

    అచ్చెన్నాయుడు బసచేసిన హోటల్ వద్ద భారీ బందోబస్తు

    టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు బసచేసిన గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హోటల్ లోకి ఎవరినీ అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  మరికాసేపట్లో టిడిపి ధర్మ పరిరక్షణ యాత్రలో పాల్గొనేందుకు అచ్చెన్నాయుడు బయలుదేరాల్సి ఉంది.

Published On - Jan 21,2021 1:09 PM

Follow us
వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..
వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..
వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా
వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..
హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?
‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?
జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..