ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టార్గెట్‌ చేయడమే చంద్రబాబు లక్ష్యం: సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం

ఏపీ మాజీ ముఖ్యమంత్రిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దబాయింపుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గురువారం...

  • Subhash Goud
  • Publish Date - 3:10 pm, Thu, 21 January 21
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టార్గెట్‌ చేయడమే చంద్రబాబు లక్ష్యం: సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం

ఏపీ మాజీ ముఖ్యమంత్రిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దబాయింపుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గురువారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీని ఉద్దేశించి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబుకు ఎందుకంత అవేశమని, దేవుడి విగ్రహాలపై చంద్రబాబు కంపరంగా మాట్లాడారని ఆరోపించారు. చట్టం గురించి తెలియదా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టార్గెట్‌ చేయడమే ఆయన లక్ష్యమన్నారు. చంద్రబాబు శాడిజం ఏమిటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

ప్రవీణ్‌ చక్రవర్తి విషయంలో విచారణ జరుగుతోందని, సంతబొమ్మాళీలో నంది విగ్రహం తొలగించింది టీడీపీ నేతలేనని సజ్జల ఆరోపించారు. అలాగే టీడీపీ సీనియర్‌ నేత కళా వెంకట్రావు అరెస్టుపై ఏం జరిగిందో తెలుసుకోకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కళా వెంకట్రావును అరెస్టు చేయలేదని, విచారణ కోసమే తీసుకెళ్లారని వెల్లడించారు. సానుభూతి కోసం అత్యంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారని సజ్జల అగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే తనను తాను తిట్టుకుంటున్నట్లు ఉందని ఎద్దేశా చేశారు.

Also Read: Chandra Babu: డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై చంద్రబాబు కన్నెర్ర.. కళా వెంకట్రావు చేసిన తప్పేంటి అంటూ నిలదీత..