అక్రమ అరెస్టులతో వైసీపీది పైశాచిక ఆనందం.. పుట్టపర్తి నిరసనలో తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తెలుగుదేశం నాయకులు నిరసనకు దిగారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్‌....

  • Updated On - 1:03 pm, Thu, 21 January 21
అక్రమ అరెస్టులతో వైసీపీది పైశాచిక ఆనందం.. పుట్టపర్తి నిరసనలో తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తెలుగుదేశం నాయకులు నిరసనకు దిగారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్‌ నేత కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ పుట్టపర్తి హనుమాన్‌ సర్కిల్‌ వద్ద టీడీపీ నేత రత్నప్ప, ఆదినారాయణ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేపట్టారు.

తెలుగు దేశం పార్టీ నేతలను అక్రమ అరెస్ట్‌లు చేయడం ఆపాలి అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడతుందని, టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నేతలను, కార్యకర్తలను అక్రమ అరెస్ట్‌లు చేయడం ఆపకుంటే వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని రత్నప్ప, ఆదినారాయణ హెచ్చరించారు