Andhra Pradesh: గంజాయి స్మగ్లర్లకు చుక్కలు చూపిస్తున్న ఏపీ పోలీసులు.. విశాఖలో వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం
ఆంధ్రప్రదేశ్‌లోని గంజాయిని రూపుమాపేందుకు పోలీస్ శాఖ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న స్మగ్లర్లు మాత్రం మారడంలేదు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో కొన్ని ముఠా సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని సరఫరా చేస్తూనే ఉన్నారు. అయితే వారి ఎత్తుగడలకు తగ్గట్లే ఏపీ పోలీసులు కూడా తెలివిగా వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గంజాయిని రూపుమాపేందుకు పోలీస్ శాఖ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న స్మగ్లర్లు మాత్రం మారడంలేదు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో కొన్ని ముఠా సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని సరఫరా చేస్తూనే ఉన్నారు. అయితే వారి ఎత్తుగడలకు తగ్గట్లే ఏపీ పోలీసులు కూడా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా.. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా కొనసాగుతుండటంతో సాగరనగరంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే.. విశాఖలోని ఆనందపురం వై జంక్షన్‌లో వెయ్యి కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురుని అరెస్టు చేసి, రెండు వాహనాలను సీజ్ చేశారు. పట్టుబడినవారిలో నలుగురు అల్లూరు జిల్లా చింతపల్లి చెందినవాళ్లు కాగా.. మరొక వ్యక్తి అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందినట్లుగా గుర్తించారు.
అయితే.. ఒడిస్సా నుంచి తమిళనాడుకు తరలిస్తున్న సమాచారం అందటంతో అలెర్టయిన విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. తనిఖీలు చేసి పట్టుకున్నారు. 40 కేజీలు చొప్పున, 25 బ్యాగుల్లో వెయ్యి కేజీల గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు. ఇక.. మరో కేసులో అనిల్‌కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా.. అతనిపై తెలుగు రాష్ట్రాల్లో 45 కేసులు వరకు ఉండగా.. 14 కేసుల్లో శిక్ష అనుభవించినట్లు వెల్లడించారు విశాఖ సీపీ త్రివిక్రమ్‌వర్మ. గత ఏప్రిల్‌లో కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలై.. మెదక్, విశాఖ, శ్రీకాకళం జిల్లాల్లో మళ్లీ నేరాలకు పాల్పడ్డట్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..