Andhra Pradesh: వివాహేతర సంబంధం కొనసాగించిన వదిన, మరిది.. ఇంట్లో విషయం తెలియడంతో ఏం చేశారంటే
ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురం సమీపంలో దారుణం చోటుచేసుకుంది. రైలు కింద పడి మరిది వదిన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లొపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(30),రాములమ్మ(27) వదినా, మరిదిలు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు.
ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురం సమీపంలో దారుణం చోటుచేసుకుంది. రైలు కింద పడి మరిది వదిన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లొపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(30),రాములమ్మ(27) వదినా, మరిదిలు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే ఈ విషయం తమ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో సోమవారం రోజున రాత్రి వారి ఇంట్లో పెద్ద గొడవ జరిగింది.
ఇక చేసేదేమి లేక వదినా, మరిదిలు ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లిపోయారు. కంభం మండలం సైదాపురం సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. చివరికి ఆ ట్రాక్‌పైనే తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి రైల్వే పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాస్‌కు రెండు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. మృతురాలు రాములమ్మకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒకే కుటుంబంలో వదినా, మరిది చనిపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..