PM Modi: ’21వ శతాబ్దం.. 140 కోట్ల భారతీయుల శతాబ్దం’
కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలకు వచ్చారు. ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ పేరుతో జరగబోయే బహిరంగ సభకు సుమారు మూడు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని స్పీచ్ హైలెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం....

సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని మోదీ.. సభా వేదికపై నుంచి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొత్తం 13వేల 430కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. అనంతరం స్పీచ్ ప్రారంభించిన మోదీ.. సోదర సోదరీమణులకు నమస్కారాలు అంటూ తెలుగులో స్పీచ్ ప్రారంభించారు. అహోబిలం నర్సింహస్వామి , మహానంది ఈశ్వరుడిని నమస్కరిస్తున్నా అన్నారు మోదీ. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నట్లు చెప్పారు. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన గుజరాత్‌లో నేను జన్మించాను.. విశ్వనాథుడి భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం లభించిందన్నారు. శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆశీస్సులు పొందానట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం.. సంస్కృతికి నిలయంగా ఉందన్నారు.
చంద్రబాబు, పవన్ రూపంలో.. ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందన్నారు పధాని మోదీ. కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. 16 నెలల్లో అభివృద్ధి డబుల్ ఇంజిన్‌లా దూసుకుపోతోందన్నారు. అభివృద్ధికి ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్‌గా నిలుస్తాం అని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. 21వ శతాబ్దం.. 140 కోట్ల భారతీయుల శతాబ్దం అన్నారు ప్రధాని. ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుందన్నారు. ప్రాజెక్టులతో పరిశ్రమలకు ఊతంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకమన్నారు. ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులతో దేశ ఇంధన సామర్థ్యం పెరుగుతుందన్నారు.
దేశంలోని ప్రతి గ్రామంలో విద్యుద్దీకరణ జరిగిందన్నారు ప్రధాని మోదీ. తలసరి విద్యుత్ వినియోగం 1400 యూనిట్లకు పెరిగిందన్నారు. ఇళ్లతో పాటు పరిశ్రమలకు తగిన విద్యుత్ అందుతోందన్నారు. సహజ వాయువు పైప్‌లైన్‌తో 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు. చిత్తూరు ఎల్‌పీజీ బాటిలింగ్ ప్లాంటుకు రోజూ 20 వేల సిలిండర్లు నింపే సామర్థ్యం ఉందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధనకు.. మల్టీమోడల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. సబ్బవరం-షీలానగర్ హైవేతో కనెక్టివిటీ మరింత మెరుగవుతుందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ప్రధాని చెప్పారు. ఈ సంకల్పానికి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం మరింత శక్తినిస్తుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారులో ఏపీ సామర్థ్యాన్ని మరింత పెంచుతామన్నారు. భారత్, ఏపీ వేగం, సామర్థ్యాన్ని యావత్ ప్రపంచం గమనిస్తోందన్నారు.




