AP New 26 Districts: ఏపీలో 26 జిల్లాలు ప్రతిపాదనలు సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్న ప్రభుత్వం

ఏపీలో కొత్త జిల్లాలు రూపుదిద్దుకోబోతున్నాయి. ఇందుకు కావల్సిన మ్యాప్ సిద్ధమైంది. రాష్ట్రంలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలను రెడీ చేసింది. ఈ మేరకు 26 కొత్త జిల్లాల ప్రతిపాదనల..

AP New 26 Districts: ఏపీలో 26 జిల్లాలు  ప్రతిపాదనలు సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్న ప్రభుత్వం
Ap 26 Districts List
Sanjay Kasula

|

Jan 25, 2022 | 10:18 PM

AP New Districts: ఆంధ్ర ప్రదేశ్‌‌(Andhra Pradesh)లో కొత్త జిల్లాలు రూపుదిద్దుకోబోతున్నాయి. ఇందుకు కావల్సిన మ్యాప్ సిద్ధమైంది. రాష్ట్రంలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలను రెడీ చేసింది. ఈ మేరకు 26 కొత్త జిల్లాల ప్రతిపాదనల రిపోర్టును ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌(Planning Secretary Vijay Kumar)… సీఎస్‌(CS)కు అందించారు. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఉగాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తిచేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్లాన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సుదీర్ఘ కసరత్తు జరిపింది ఏపీ సర్కార్. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పాటు చేస్తోంది . దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు పెరగనుంది. అర‌కు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ భౌగోళిక రిత్యా చాలా విస్తార‌మైనది కావ‌డంతో.. ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి: Telangana Corona: తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై కీలక ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్..

UP Election 2022: సమాజ్‌వాదీ పార్టీకి మరో షాక్, బీజేపీలో చేరిన జలాల్‌పూర్ ఎమ్మెల్యే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu