ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది . జలాల్పూర్ ఎస్పీ ఎమ్మెల్యే సుభాష్రాయ్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో సుభాష్ రాయ్ బీజేపీలో చేరారు. నిజానికి సుభాష్ రాయ్ చాలా కాలంగా పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు ఎస్పీ హామీ ఇచ్చింది.. దీంతో అసంతృతితో ఉన్న సుభాష్ బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. జలాల్పూర్ నుంచి టికెట్ కోల్పోవడంతో ఆయన అఖిలేష్ యాదవ్ నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్నారు. ఎస్పీ జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చేందుకు ఆశ చూపిచినప్పటికీ.. స్వీకరించేందుకు సుభాష్ నిరాకరించారు.
Samajwadi Party MLA from Uttar Pradesh’s Jalalpur, Subhash Rai joins Bharatiya Janata Party in Delhi pic.twitter.com/5Ncy9mQwx5
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 24, 2022
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సుభాష్రాయ్కు కండువ కప్పి పార్టీ సభ్యత్వం ఇచ్చి బీజేపీలోకి స్వాగతం పలికారు. సుభాష్ రాయ్ ఇప్పటికే బీజేపీలో ఉన్నారని స్వతంత్ర దేవ్ వెల్లడించారు. ఇది అతని నూతన గృహప్రవేశం అని అభివర్ణించారు. యూపీలో పాలన సాగుతున్న తీరు, జాతీయవాదం అనే చర్చ సాగుతున్న నేపథ్యంలో ఆయన పార్టీలో చేరినట్లుగా పేర్కొన్నారు.
సుభాష్ రాయ్ రాకతో అంబేద్కర్ నగర్ ఏరియా, అవధ్ ప్రాంతంలో బీజేపీకి బలం పెరిగినట్లైంది. ఈ ప్రాంతంపై ఆయన ప్రభావం చాలా ఉంది. ఏళ్లుగా దళితులు, వెనుకబడిన వారి కోసం ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల ఆలోచనలతో సుభాష్ రాయ్ ప్రభావితమై బీజేపీలో చేరారు.
సమాజ్‌వాదీ పార్టీకి ఇది మూడో భారీ ఎదురుదెబ్బ. దీనికి ముందు ములాయం కోడలు అపర్ణా యాదవ్, ఆమె బావ కూడా బీజేపీలో చేరారు.
ఇవి కూడా చదవండి: Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Medicinal Plants: ఔషద మొక్కల పెంపకంతో అద్భుతాలు.. ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసా..