AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మాజీ సీఎం తన ప్రథమ శత్రువు’.. మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు..

మాజీ సీఎం కిరణ్ తనకు ప్రథమ శత్రువు అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు మండలం అరేడిగుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దిరెడ్డి.. మే 13న జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోనే ఓట్లు వేయాలని కోరారు.

'మాజీ సీఎం తన ప్రథమ శత్రువు'.. మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు..
Peddireddy Ramachandra Redd
Raju M P R
| Edited By: Srikar T|

Updated on: Apr 05, 2024 | 3:05 PM

Share

మాజీ సీఎం కిరణ్ తనకు ప్రథమ శత్రువు అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు మండలం అరేడిగుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దిరెడ్డి.. మే 13న జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోనే ఓట్లు వేయాలని కోరారు. గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులపై పోటీ చేసిన గెలిచిన మిథున్ రెడ్డిని ఈ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి కిరణ్‎పై భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాజీ సీఎం కిరణ్‎పై మంత్రి పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పుంగనూరు ప్రాంతానికి తాగునీరు అందించే ప్రాజెక్టును సీఎంగా కిరణ్ అప్పట్లో అడ్డుకున్నారని విమర్శించారు. పింఛా ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా కోసం టెండర్లు పూర్తయినప్పటికీ పనులను అప్పటి సీఎం కిరణ్ ఆపించారని విమర్శించారు. అప్పట్లో పింఛా ప్రొజెక్టు వరకు పాదయాత్ర కూడా చేశామన్నారు పెద్దిరెడ్డి.

సీఎంగా కిరణ్ పీలేరు నియోజకవర్గం వరకే గిర్ర గీసుకొని రోడ్లు వేశారన్నారు పెద్దిరెడ్డి. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పుంగనూరుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. అందరికీ చెప్పి తనకంటే ఎక్కువ మెజారిటీతో మిథున్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని, ఆ విధంగా పని చేయండని కేడర్‎ను కోరారు. బిజెపి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించండని పిలుపునిచ్చారు. జగన్‎ను 16 నెలలు జైలుకు పంపి, రాష్ట్రం విడిపోవడానికి కిరణ్ తోడ్పాటు అందించారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..