AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురుపై దారుణానికి పాల్పడిన తండ్రి.. ఎందుకు చంపాడంటే..

కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. ఏ ప్రాణి అయిన తమ సంతానాన్ని ప్రాణం కన్నా మిన్నగా చేసుకుంటాయి. అయితే ఓ కసాయి తండ్రి కూతురు నల్లగా పుట్టిందన్న కోపంతో ఏకంగా గొంతు నులిమి చంపేశాడు. తండ్రి చేతిలో కను మూసిన ఆ బాలిక మరణం ఇప్పుడు వివాదాస్పదంగా మారటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిజనిజాలు తేల్చే పనిలో పడ్డారు.

కూతురుపై దారుణానికి పాల్పడిన తండ్రి.. ఎందుకు చంపాడంటే..
Baby Dies
T Nagaraju
| Edited By: |

Updated on: Apr 05, 2024 | 3:42 PM

Share

కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. ఏ ప్రాణి అయిన తమ సంతానాన్ని ప్రాణం కన్నా మిన్నగా చేసుకుంటాయి. అయితే ఓ కసాయి తండ్రి కూతురు నల్లగా పుట్టిందన్న కోపంతో ఏకంగా గొంతు నులిమి చంపేశాడు. తండ్రి చేతిలో కను మూసిన ఆ బాలిక మరణం ఇప్పుడు వివాదాస్పదంగా మారటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిజనిజాలు తేల్చే పనిలో పడ్డారు. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన యువకుడికి మూడేళ్ల క్రితం బొమ్మరాజుపల్లికి చెందిన యువతితో వివాహమైంది. మొదటి ఏడాది వీరికి సంతానం కలగలేదు. దీంతో పిల్లులు పుట్టాలంటూ పూజలు చేశారు. చివరికి ఏడాదిన్నర క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది ఆ తల్లి. అప్పటి నుండి ఆ తల్లి కూతురిని అల్లారుముద్దుగా పెంచుకుంటుంది.

అయితే పద్దెనిమిది నెలల చిన్నారి నల్లగా ఉండటం ఆ తండ్రికి నచ్చలేదు. దీంతో ఆ చిన్నారిపై కక్ష పెంచుకున్నాడు. చిన్న వయస్సులోనే చిదిమి వేయాలనుకున్నాడు. ఒకసారి అతని ప్లాన్ ఫెయిల్ అయింది. అయినా పట్టు విడవలేదు. రెండో ప్రయత్నంలో తాను అనుకున్నది సాధించాడు. గొంతు నులిమి చంపేశాడు. అంతకముందు నీళ్ల డ్రమ్ములో ముంచి చంపే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ తల్లే అడ్డుకుంది. అయితే ఆ తర్వాత రాత్రి సమయంలో చిన్నారి గొంతు నులిమే సరికి ముక్కు వెంట రక్తం కారింది. అనుమానం వచ్చిన వెంటనే చిన్నారి తీసుకొని తల్లి ఆసుపత్రికి పరుగెత్తింది. అయితే అప్పటికే ఆ చిన్నారి చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఆ తల్లి భర్తను నిలదీసింది. అతనే చంపినట్లు నిర్ఱారణకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే అంత్యక్రియలు ముగియడంతో పోస్ట్ మార్టం చేసేందుకు పోలీసులు, వైద్యులు సిద్దమయ్యారు. అయితే చిన్నారి నల్లగా ఉందన్న కారణంతోనే చంపినట్లు అందరూ అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!