ఒంగోలులో దారుణం.. పెళ్లైన 7 నెలలకే భార్యను హతమార్చిన భర్త.. డౌట్‌ రాకుండా కారెంట్‌ షాక్‌ నాటకం

పెళ్ళయి ఏడు నెలలు నిండకుండానే కొత్త పెళ్లికూతురు చనిపోయిందని భర్త, అత్తమామలు చెప్పడంతో అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి బంధువులు ఒంగోలులో ఆందోళనకు దిగారు. షాలినికి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించి హత్య చేసి, కరెంట్‌ షాక్‌తో చనిపోయినట్టు చిత్రీకరిస్తున్నారని..

ఒంగోలులో దారుణం.. పెళ్లైన 7 నెలలకే భార్యను హతమార్చిన భర్త.. డౌట్‌ రాకుండా కారెంట్‌ షాక్‌ నాటకం
Ongole Crime
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 14, 2023 | 1:58 PM

పెళ్ళయి ఏడు నెలలు నిండకుండానే కొత్త పెళ్లికూతురు చనిపోయిందని భర్త, అత్తమామలు చెప్పడంతో అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి బంధువులు ఒంగోలులో ఆందోళనకు దిగారు. షాలినికి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించి హత్య చేసి, కరెంట్‌ షాక్‌తో చనిపోయినట్టు చిత్రీకరిస్తున్నారని షాలిని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, షాలిని భర్త సందీప్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను హత్య చేసి, ప్రమాదవశాత్తూ కరెంట్‌ షాక్‌తో చనిపోయిందని చెబుతున్న నిందితుడు సందీప్‌ను కఠినంగా శిక్షించాని కోరుతూ ఆందోళనకు దిగారు. ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై రాస్తారోకోకు దిగారు.

తమ బిడ్డ మృతికి కారణమైనా సందీప్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలంటూ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై ఉన్న బస్సు ముందు చక్రాల కింద పడుకుని తమ బిడ్డకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. బస్సు చక్రాలకు అడ్డంగా పడుకున్న మృతురాలి బంధువును పోలీసులు వారించి పక్కకు తీసుకువచ్చారు. అనంతరం సమగ్ర విచారణ జరిపిస్తామని ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. తమ బిడ్డను భర్త సందీప్‌, అత్తమామలే చంపేసి , కరెంట్‌ షాక్‌తో చనిపోయినట్టు చిత్రీకరిస్తున్నారని షాలిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ప్రకాశంజిల్లా కొండెపి మండలం పెరిదేపి గ్రామానికి చెందిన షాలిని అనే యువతిని నాగులుప్పలపాడు మండలం బి.నిడమానూరు కు చెందిన అంపర్తి సందీప్ అనే యువకుడికి ఇచ్చి 7 నెలల క్రితం వివాహం జరిపించారు. మద్యానికి బానిసగా ఉండటమే కాకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్నట్టు సందీప్‌పై అనుమానాలు ఉన్నాయి. అంతే కాకుండా పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలని సందీప్‌ వేదించే వాడని షాలిని బంధువులు ఆరోపిస్తున్నారు. షాలిని బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి చెడు వ్యవసనాలకు ఖర్చు చేస్తుండటంతో కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఈ నేపద్యంలో షాలిని కరెంట్‌ షాక్‌కు గురై ఒంగోలులోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని భర్త సందీప్‌ అత్తమామలకు ఫోన్‌ చేసి చెప్పాడు. అత్తమామలు ఒంగోలు వచ్చే లోపే ఆమె చనిపోయిందని మృతదేహాన్ని రిమ్స్‌ ఆసుపత్రిలో పోస్టుమార్టంకు తరలించాడని చెప్పడంతో షాలిని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా షాలిని ఒంటిపై గాయాలున్నట్టు గుర్తించామని, నోటి నుంచి కూడా నురగ వస్తుందని చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని షాలిని బంధువులు రోడ్డుపై రాస్తారోకోకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.