TS Model Schools Admissions 2023: మరో రెండు రోజుల్లో తెలంగాణ గురుకుల మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష.. విద్యార్ధులకు ముఖ్య సూచనలివే..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఏప్రిల్ 16 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈఓ రేణుకాదేవి గురువారం (ఏప్రిల్ 13) తెలిపారు. ఆరో తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించడానికి ఏప్రిల్ 16 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈఓ రేణుకాదేవి గురువారం (ఏప్రిల్ 13) తెలిపారు. ఆరో తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష ఉంటుందని, 7,8,9,10వ తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఇప్పటికే ఆయా తరగతుల ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయని తెలిపారు. పరీక్ష రోజున విద్యార్థులు హాల్ టికెట్లు తీసుకుని తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థులు, సిబ్బంది, ఇన్విజిలేటర్ల మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా తీసుకొస్తే కఠినచర్యలు తప్పవని సూచించారు.
కాగా ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70,041 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఫలితాలను మే 15న ప్రకటిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఆయా మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.
మోడల్ స్కూళ్లలో 7-10వ తరగతుల ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.